Ganga River | దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రధాన నదుల్లో నీటి మట్టం పెరిగి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. బీహార్ రాష్ట్రంలోని గంగా నది సైతం ప్రమాదం అంచున ఉంది. నదిలో నీటి మట్టం భారీగా పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
పాట్నా జిల్లాలోని పలు పాఠశాలలను అధికారులు మూసివేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని సుమారు 76 ప్రభుత్వ పాఠశాలలను ఆగస్టు 31 వరకూ మూసివేస్తున్నట్లు జిల్లా యంత్రాంగం ప్రకటించింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. ‘గంగా నదిలో నీటి మట్టం పెరుగుతున్న దృష్ట్యా పాట్నా జిల్లాలోని ఎనిమిది బ్లాకుల్లో మొత్తం 76 ప్రభుత్వ పాఠశాలలను ఆగస్టు 31 వరకూ మూసివేస్తున్నాం’ అని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఇటీవలే పాట్నా సమీపంలో ఓ ప్రభుత్వ పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు గంగా నదిలో పడి వరద ఉద్ధృతికి కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. దీంతో అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకొని ముందు జాగ్రత్త చర్యగా సెలవులు ప్రకటించారు.
Also Read..
Gujarat Rains | భారీ వర్షాలకు స్తంభించిన గుజరాత్.. 15 మంది మృతి
Gujarat | గుజరాత్లో భారీ వర్షాలు.. వరద ఉద్ధృతికి కుప్పకూలిన బ్రిడ్జ్.. షాకింగ్ వీడియో
Terrorist | రామేశ్వరం కేఫ్ తరహాలో రైళ్లపై దాడులకు కుట్ర.. కలకలం సృష్టిస్తోన్న పాక్ ఉగ్రవాది వీడియో