Gujarat | గుజరాత్‌ను భారీ వర్షాలు (Gujarat Rains) ముంచెత్తాయి. సౌరాష్ట్ర ప్రాంతంలో గత మూడు రోజులుగా ఎడతెరిపి లేని వర్షాలు పడుతున్నాయి. దీంతో అనేక ప్రాంతాల్లో వరద పోటెత్తుతోంది (massive flooding). పలు నగరాల్లో ప్రధాన రహదారులపై నడుము లోతు నీరు చేరింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నదులు, డ్యాముల్లో నీటి మట్టం భారీగా పెరిగింది. దీంతో ఆయా నదులు ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తున్నాయి.
ఈ క్రమంలో సురేంద్రనగర్ (Surendranagar) జిల్లాలోని భోగావో నదిపై (Bhogavo river) ఉన్న చిన్న వంతెన వరద ఉద్ధృతికి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది (Bridge Collapses). 100 మీటర్ల పొడవు ఉన్న ఈ వంతెన హబియాసర్ గ్రామాన్ని చోటిలా పట్టణంతో అనుసంధానిస్తోంది. ఈ వంతెనను ఐదేళ్ల క్రితమే నిర్మించినట్లు హబియాసర్ గ్రామ సర్పంచ్ తేజాభాయ్ భర్వాద్ తెలిపారు. ‘నాని మోర్సాల్ గ్రామ సమీపంలోని డ్యామ్ పొంగి పొర్లడంతో పెద్ద ఎత్తున నీరు నదిలోకి ప్రవేశించింది. ఆ వరద ఉద్ధృతికి వంతెన కూలిపోయింది. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు’ అని చోటిలా సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ కేకే శర్మ తెలిపారు. బ్రిడ్జ్ కూలిపోతున్న దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.
જોખમી પુલથી સાવધાન!!
સુરેન્દ્રનગરઃ ચોટીલાના હબિયાસર ગામે 5થી વધુ ગામોને જોડતો પુલ ધરાશાયી#GujaratRains #GujaratFlood #Surendranagar @Zee24Kalak pic.twitter.com/DMf2dKtuWx
— Dixit Soni (@DixitGujarat) August 27, 2024
Also Read..
Gujarat Rains | భారీ వర్షాలకు స్తంభించిన గుజరాత్.. 15 మంది మృతి
Terrorist | రామేశ్వరం కేఫ్ తరహాలో రైళ్లపై దాడులకు కుట్ర.. కలకలం సృష్టిస్తోన్న పాక్ ఉగ్రవాది వీడియో
Twitter | ఎక్స్ సర్వర్ డౌన్.. ప్రపంచ వ్యాప్తంగా సమస్యలు ఎదుర్కొన్న వినియోగదారులు