Terrorist | దేశవ్యాప్తంగా రైళ్లపై దాడులు చేయాలంటూ భారతదేశంలోని స్లీపర్ సెల్స్‌కు పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాది (Terrorist) ఫర్హతుల్లా ఘోరీ (Farhatullah Ghori) సూచించినట్టుగా ఉన్న ఓ వీడియో ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది. ఈ వీడియోను ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు గుర్తించి వెంటనే అప్రమత్తమయ్యాయి. ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉంటున్న ఘోరీ.. పాకిస్థాన్‌కు చెందిన ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI) సపోర్ట్‌తో బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో స్లీపర్ సెల్ ద్వారా పేలుళ్లకు పాల్పడినట్లు సమాచారం.
తాజాగా భారత్దేశంలోని రైళ్లపై దాడులకు సంబంధించి (attacks on trains across India) ఆదేశాలు ఇస్తున్న మూడు నిమిషాల వీడియో ఇటీవలే సామాజిక మాధ్యమాల్లో వెలుగులోకి వచ్చింది. ఆ వీడియోలో రైళ్లు, పెట్రోలియం పైప్లైన్లపై దాడులు, ప్రెజర్ కుక్కర్లు ఉపయోగించి పేలుళ్లు, హిందూ నాయకులను లక్ష్యంగా చేసుకొని దాడులు చేయాలంటూ ఘోరీ వ్యాఖ్యానించారు. ఈడీ, ఎన్ఐఏ ద్వారా భారత ప్రభుత్వం స్లీపర్ సెల్స్‌ను వారి ఆస్తులను లక్ష్యంగా చేసుకుని నిర్వీర్యం చేస్తోందని ఘోరీ వీడియోలో తెలిపాడు. తాము తిరిగొచ్చి ఇండియన్ గవర్నమెంట్‌ను షేక్ చేస్తామని వీడియోలో ఘోరీ వెల్లడించాడు. మూడు వారాల క్రితం టెలిగ్రామ్‌లో ఈ వీడియో విడుదలైనట్టు ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు తెలిపాయి.
కాగా, ఫర్హతుల్లా ఘోరీకి అబూ సుఫియాన్, సర్దార్ సాహబ్, ఫరూ అనే పేర్లు కూడా ఉన్నాయి. భారత్‌లో గతంలో చోటు చేసుకున్న అనేక పేలుళ్ల వెనుక ఘోరీ హస్తం ఉంది. ఈ ఏడాది మార్చిలో బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో పేలుళ్లు (Rameshwaram Cafe blast) సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో సుమారు 10 మంది వరకూ గాయపడ్డారు. ఇక 2002లో గుజరాత్‌లోని అక్షరథామ్ దేవాలయంపై జరిగిన దాడిలో 30 మందికి పైగా మరణించిన విషయం తెలిసిందే. 2005లో హైదరాబాద్‌లోని టాస్క్‌ఫోర్స్ కార్యాలయంపై జరిగిన ఆత్మాహుతి దాడి వెనుక కూడా అతడి హస్తమే ఉంది.
ఘోరీ ఆన్లైన్ జిహాదిస్ట్ రిక్రూట్మెంట్ కార్యకలాపాలు చూస్తున్నాడని.. ఢిల్లీ పోలీసులు గతంలో తెలిపారు. ఘోరీ ఉగ్రవాదుల హ్యాండ్లర్ అని వారు వెల్లడించారు. కొన్ని నెలల క్రితం, పుణె-ఐఎస్ఐఎస్ మాడ్యూల్‌కు చెందిన అనేక మంది ఉగ్రవాదులను దేశవ్యాప్తంగా అరెస్టు చేయడంతో ఢిల్లీ పోలీసులు ఘోరీ పేరును రికార్డుల్లోకి ఎక్కించారు. భారత్‌లో ఐఎస్ఐ స్లీపర్ సెల్స్‌ను నిర్వహిస్తోందని.. వాటి ద్వారా దాడులకు యువకులను రిక్రూట్ చేస్తోందని అధికారులు అప్పట్లో వెల్లడించారు.
Also Read..
Rajya Sabha | ఎగువసభలో పెరిగిన బీజేపీ బలం.. మెజారిటీ మార్క్‌ను దాటిన ఎన్డీయే కూటమి
Gujarat Rains | భారీ వర్షాలకు స్తంభించిన గుజరాత్.. 15 మంది మృతి
Twitter | ఎక్స్ సర్వర్ డౌన్.. ప్రపంచ వ్యాప్తంగా సమస్యలు ఎదుర్కొన్న వినియోగదారులు