Rajya Sabha | ఎగువసభలో పెరిగిన బీజేపీ బలం.. మెజారిటీ మార్క్‌ను దాటిన ఎన్డీయే కూటమి
Rajya Sabha | రాజ్యసభలో బీజేపీ సంఖ్యా బలం పెరిగింది. మొన్నటి వరకూ ఎగువ సభలో ఎన్డీయే (NDA) కూటమికి మెజారిటీ తక్కువగా ఉన్న విషయం తెలిసిందే.
Rajya Sabha | రాజ్యసభలో బీజేపీ సంఖ్యా బలం పెరిగింది. మొన్నటి వరకూ ఎగువ సభలో ఎన్డీయే (NDA) కూటమికి మెజారిటీ తక్కువగా ఉన్న విషయం తెలిసిందే. దీంతో కీలక బిల్లుల ఆమోదం కోసం ఇతర పార్టీ ఎంపీల మద్దతుపై ఎన్డీయే సర్కార్ ఆధారపడాల్సిన పరిస్థితి ఉండేది. అయితే, తాజాగా ఆ పరిస్థితిని బీజేపీ అధిగమించింది.
తాజాగా రాజ్యసభకు 12 మంది సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. వీరిలో తొమ్మిది మంది బీజేపీ సభ్యులు కాగా, ఎన్డీఏ మిత్రపక్షాలైన ఎన్సీపీ (అజిత్ పవార్) నుంచి ఒకరు, రాష్ట్రీయ లోక్‌మంచ్ నుంచి ఒకరు ఉన్నారు. దీంతో ఎగువ సభలో బీజేపీ బలం 96కి పెరిగింది. 245 స్థానాలుండే రాజ్యసభలో ప్రస్తుతం 237 మంది సభ్యులు ఉన్నారు. మెజారిటీ సాధించడానికి 119 మంది సభ్యులు అవసరం. కూటమిగా చూస్తే ఎన్డీయే బలం 121కి చేరింది. దీంతో పార్లమెంటు ఎగువ సభలో బిల్లులను ఆమోదింపజేసుకునేందుకు ఎన్డీయేకి మార్గం సుగమం అయింది. ఇక ప్రతిపక్ష పార్టీల రాజ్యసభ సభ్యుల సంఖ్య 85గా ఉంది.
తాజాగా రాజ్యసభకు ఎన్నికైన 12 మంది సభ్యుల్లో.. బీజేపీ తరపున అస్సాం నుంచి మిషన్ రంజన్ దాస్, రామేశ్వర్ తేలి, బీహార్ నుంచి మనన్ కుమార్ మిశ్రా, హర్యానా నుంచి కిరణ్ చౌదరి, మధ్యప్రదేశ్ నుంచి జార్జ్ కురియన్, మహారాష్ట్ర నుంచి ధైర్యశీల్ పాటిల్, ఒడిశా నుంచి మమతా మహంత, రాజస్థాన్ నుంచి రవ్నీత్ సింగ్ బిట్టు, త్రిపుర నుంచి రాజీవ్ భట్టాచార్య రాజ్యసభకు ఎన్నికయ్యారు. కాంగ్రెస్ తరపున తెలంగాణ నుంచి అభిషేక్ మను సింఘ్వి, ఎన్సీపీ తరపున మహారాష్ట్ర నుంచి నితిన్ పాటిల్, ఆర్ఎల్ఎం తరపున బీహార్ నుంచి ఉపేంద్ర కుశ్వాహ ఏకగ్రీవంగా గెలుపొందారు.
Also Read..
Gujarat Rains | భారీ వర్షాలకు స్తంభించిన గుజరాత్.. 15 మంది మృతి
Twitter | ఎక్స్ సర్వర్ డౌన్.. ప్రపంచ వ్యాప్తంగా సమస్యలు ఎదుర్కొన్న వినియోగదారులు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pankaja | ఆస్కార్ బరిలో తెలుగమ్మాయిల సత్తా.. అకాడమీ రేసులోకి ‘పంకజ’ షార్ట్‌ఫిలిం!
Sudigali Sudheer | సుడిగాలి సుధీర్‌పై ‘గోట్’ నిర్మాత సంచలన ఆరోపణలు.. చివరి 30 శాతం షూటింగ్‌కు రాలేదంటూ కామెంట్
Train Trailer | మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు విజయ్ సేతుపతి.. ఆకట్టుకుంటున్న ‘ట్రైన్’ ట్రైలర్!
Diksha Divas | ముఖ్రా (కె) గ్రామంలో ఒకరోజు ముందే దీక్షా దివస్.. కేసీఆర్ చిత్రపటానికి పూలు, పాలతో అభిషేకం.. Video
Ramayana | బాహుబలి 2 రికార్డు బద్దలు కొట్టిన ‘రామాయణ’.. 23 రోజుల్లోనే రూ.1,790 కోట్ల వసూళ్లు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

