Twitter | అమెరికన్ టైకూన్, స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ ( Elon Musk) ఆధీనంలోని ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విట్టర్ (ఎక్స్) ఇటీవలే మాటిమాటికీ సతాయిస్తోంది. ఏదో ఒక సమస్యతో యూజర్లను ఇబ్బందులకు గురి చేస్తోంది. ఇటీవలే ట్విట్టర్ సేవల్లో అంతరాయం ఏర్పడటం.. లాగిన్ కాకపోవడం, ట్వీట్స్ మాయం కావడం వంటి సమస్యలు తలెత్తిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి ఎక్స్‌లో ఇలాంటి సమస్యే తలెత్తింది.
సాంకేతిక సమస్యల కారణంగా ట్విట్టర్ సర్వర్ డౌన్ (X suffers brief outage) అయ్యింది. ఎక్స్ సైట్‌ను ఓపెన్ చేయగా.. పేజీలు లోడ్ కావడం లేదు. స్క్రీన్‌పై ‘సమ్‌థింగ్ వెంట్ రాంగ్.. ప్లీజ్ ట్రై అగెయిన్’ (something went wrong) అన్న సందేశం కనిపిస్తోంది. దీంతో కొన్ని నిమిషాల పాటు ఎక్స్ సేవలకు అంతరాయం ఏర్పడింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వినియోగదారులు ఒకింత గందరగోళానికి గురయ్యారు.
డౌన్ డిటెక్టర్ వెబ్సైట్ ప్రకారం.. భారతదేశంలో ఉదయం 9:15 గంటలకు ఎక్స్ సేవల్లో అంతరాయం ఏర్పడింది. సుమారు 915 మంది ఈ సమస్యను ఎదుర్కొన్నారు. అదేవిధంగా అమెరికాలో ఉదయం 8:45 గంటల సమయంలో దాదాపు 36 వేల మంది, కెనడాలో 3,300 మంది, యూకేలో 1,600 మంది ఈ సమస్యను ఎదుర్కొన్నారు. ఎక్స్ అంతరాయానికి కారణాలు ఇంకా తెలియరాలేదు. చాలా మంది వినియోగదారులు సర్వర్ డౌన్ అయినట్లు ఫిర్యాదు చేశారు.
Also Read..
Chinese hackers: భారత్, అమెరికా ఇంటర్నెట్ సంస్థలపై చైనా హ్యాకర్ల దాడి
Air India | ఎయిరిండియా కీలక నిర్ణయం.. ప్రాంతీయ భాషల్లోనూ కస్టమర్ కేర్ సేవలు
Amy Jackson: ఎడ్ వెస్ట్విక్ను పెళ్లాడిన ఆమీ జాక్సన్.. స్పెషల్ అట్రాక్షన్‌గా ఆమె కుమారుడు