Secunderabad | సికింద్రాబాద్ అస్తిత్వంపై జరుగుతున్న కుట్రకు నిరసనగా లష్కర్ జిల్లా సాధన సమితి కార్యాచరణను నిర్ణయించింది. గ్రేటర్ సికింద్రాబాద్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో ఇవాళ సికింద్రాబాద్ ముఖ్య నేతలు సమావేశమయ్యారు. సికింద్రాబాద్‌లోని బాలం రాయిలీ ప్యాలెస్‌లో లష్కర్ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో ఈ భేటీ జరిగింది. ఈ సమావేశంలో మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు గౌడ్, ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యచరణను ప్రకటించారు.
ఈ నెల 17వ తేదీన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ప్యారడైజ్ గాంధీ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించాలని ఈ సమావేశంలో నిర్వహించారు. 10 వేల మందితో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ముట్టడించాలని నిర్ణయించారు. అలాగే సికింద్రాబాద్ బంద్‌కు కూడా పిలుపునివ్వాలని నిర్ణయించారు. సంక్రాంతి పండుగ తర్వాత దీనికి సంబంధించిన పూర్తి కార్యాచరణను ప్రకటించనున్నారు.