Musi Victims | రేవంత్ రెడ్డికి ఓటేసిన కర్మానికి ఇలా జరుగతదని అనుకోలేదు.. కేసీఆర్‌కే ఓటేసి గెలిపిస్తాం : మూసీ బాధితులు
musi victims | ప్రజాభిప్రాయాలకు వ్యతిరేకంగా మూసీ సుందరీకరణ ప్రాజెక్టు విషయంలో సీఎం రేవంత్ రెడ్డి తీరుపై మూసీ బాధితులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కోసం కిస్మత్ పూర్, దర్గా ఖలీజ్ ఖాన్, హిమాయత్ సాగర్ గ్రామాల్లో భూ సేకరణకు వెళ్లిన అధికారులను ప్రజలు అడ్డుకున్నారు.
Musi Victims | కాంగ్రెస్ ప్రభుత్వం రూ.5000 కోట్లతో దేశంలోనే ఎత్తైన గాంధీ విగ్రహాన్ని మూసీ నది ఒడ్డున నిర్మించేందుకుగాను ఈసీ, మూసీ నదుల సంగమం వద్ద ఉన్న పది ఎకరాల భూసేకరణకు నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. తమ ఇండ్లు కూలగొట్టి గాంధీ విగ్రహం ఏర్పాటు చేయాలన్న రేవంత్ ప్రభుత్వం నిర్ణయం పట్ల ప్రజల నుండి , ప్రజా సంఘాల నుండి, పర్యావరణవేత్తల నుండి, రాజకీయ పార్టీల నుండి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ప్రజాభిప్రాయాలకు వ్యతిరేకంగా మూసీ సుందరీకరణ ప్రాజెక్టు విషయంలో సీఎం రేవంత్ రెడ్డి తీరుపై మూసీ బాధితులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కోసం కిస్మత్ పూర్, దర్గా ఖలీజ్ ఖాన్, హిమాయత్ సాగర్ గ్రామాల్లో భూ సేకరణకు వెళ్లిన అధికారులను ప్రజలు అడ్డుకున్నారు.
కిస్మత్ పూర్లో ఓ మూసీ బాధితుడు మాట్లాడుతూ.. మేము ఒకవేళ గవర్నమెంట్ ల్యాండ్‌లో ఉంటే ఇచ్చేవాళ్లం.. మేం పట్టా భూమిలో ఉన్నాం. డబుల్ బెడ్రూం కట్టిస్తే వెళ్తరా..? అంటే తాము డబ్బులకు ఆశించడం లేదని.. సొంతిల్లనేది ఓ కళ. రెండు సంవత్సరాలు కష్టపడి అప్పులు చేసి, బంగారం అమ్మి మరీ ఇల్లు కట్టుకున్నాం. మాపిల్లలు ఇక్కడే చదువుతున్నరు. ఇక్కడ నుంచి వెళ్లిపోమంటే మేం ఎక్కడికెళ్తం. మా గ్రామంలో 250 కుటుంబాలున్నాయి. మేమంతా కూడా ఓ కుటుంబం లాగా నివసిస్తున్నం ఇక్కడ. రేవంత్ రెడ్డికి నేనే ఓటేశా. కానీ ఆయనకు ఓటేసిన కర్మానికి ఇలా జరుగతదని అనుకోలేదు. రేవంత్‌కు ఓటేసినందుకు శిక్ష అనుభవిస్తున్నట్టు అనిపిస్తుంది.
ఇప్పుడు ఇండ్లు గుంజుకుంటుంటే మా కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది. అప్పు చేసి కట్టుకున్న ఒక్క ఇల్లు ఇవ్వడానికి మేము సిద్ధంగా లేము. గతంలో కేసీఆర్ ఎప్పుడు ఇలా పేదల జోలికి వెళ్ళలేదు.. రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుండి కూల్చడమే తప్ప, నిలబెట్టింది లేదని మండిపడ్డాడు.
మరో బాధితుడు మాట్లాడుతూ.. కేసీఆర్ సామాన్య ప్రజలను ఏ రోజు కూడా టచ్ చేయలేదు. కేసీఆర్‌ను ఓడించి కాంగ్రెస్ పార్టీ వచ్చిందంటే.. వీళ్లు ఒట్టిగనే రాలేదు కదా.. కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిర్రు కావచ్చు. ఇప్పుడు అవన్నీ రిటర్న్ తీసుకోవాలి కదా.. మాకు కాళేశ్వరం ప్రాజెక్టు మీద దునియా చెప్పి మా మైండ్ వాష్ చేస్తే మేం పోయి కాంగ్రెస్‌కు ఓటేసినం. అది మేం చేసిన తప్పు. ఈ సారి మా కుటుంబం మొత్తం కేసీఆర్‌కే ఓటేసి గెలిపిస్తాం. ఇంకో 10 ఏండ్లు రేవంత్ రెడ్డి సీఎంగా ఉంటే మొత్తం స్మశాన వాటికగా మారిపోతుంది, అందరూ ఆత్మహత్య చేసుకుంటారంటూ కిస్మత్ పూర్ మూసీ బాధితులు వాపోతున్నారు.
రేవంత్ రెడ్డికి ఓటు వేసిన కర్మకి శిక్ష అనుభవిస్తున్నాను
ఇప్పుడు ఇండ్లు గుంజుకుంటుంటే మా కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది
అప్పు చేసి కట్టుకున్న ఒక్క ఇల్లు ఇవ్వడానికి మేము సిద్ధంగా లేము
గతంలో కేసీఆర్ ఎప్పుడు ఇలా పేదల జోలికి వెళ్ళలేదు.. రేవంత్ రెడ్డి… https://t.co/GRQgQGn4N6 pic.twitter.com/JsENmiek6r
— Telugu Scribe (@TeluguScribe) February 23, 2026
రేవంత్ రెడ్డి ఎన్నికల్లో గెలవడానికి ఖర్చు పెట్టిన డబ్బులు దండుకోడానికే ఈ మూసీ సుందరీకరణ చేస్తున్నాడు
కేసీఆర్ గారు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినందుకు క్షమించండి.. ఇకనుండి మేము బ్రతికి ఉన్నంత కాలం మా కుటుంబం మొత్తం మీకే ఓటు వేస్తాము – కిస్మత్ పూర్ మూసీ బాధితులు https://t.co/Z3gqDmiSJJ pic.twitter.com/CRYMnejdhw
— Telugu Scribe (@TeluguScribe) February 23, 2026
Read Also :
The Paradise | ‘ది ప్యారడైజ్’ నుంచి ఫస్ట్ సింగిల్ ‘ఆయా షేర్’ ప్రోమో రిలీజ్.. నాని ఎనర్జీ చూసి షాక్!
Nani | మాస్ మోడ్‌లో నాని.. ‘బ్లడీ రోమియో’లో నేచురల్ స్టార్ సరసన బాలీవుడ్ బ్యూటీ?
MSG | ‘మన శంకర వరప్రసాద్ గారు’ సూపర్ సక్సెస్ – రీజినల్ ఇండస్ట్రీ హిట్‌గా సంచలనం!
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

