న్యూఢిల్లీ: ఫిల్మ్ స్టార్ ఆమీ జాక్సన్(Amy Jackson) పెళ్లి చేసుకున్నది. దక్షిణ ఇటలీలోని 16వ శతాబ్ధం నాటి కాస్టెల్లో రోకో కోటలో ఆమె ఎడ్ వెస్ట్విక్ను మనువాడింది. అయితే ఈ వేడుకలో అమీ జాక్సన్ కుమారుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ఆమీ, వెస్విక్లో.. పెళ్లి వేదికకు పిల్లోడిని పట్టుకుని వచ్చారు. మాజీ భాగస్వామి జార్జ్ పనయిటోతో ఆమీ జాక్సన్‌కు ఒక కుమారుడు ఉన్నాడు. పెళ్లి కూతురు డ్రెస్సులో వేదికకు వస్తున్న తల్లి ఆమీని చూసి ఆమె కుమారుడు తెగ సంతోషపడిపోయాడు. ఫ్రెండ్స్, ఫ్యామిలీ మధ్య తమ పెళ్లి జరిగినట్లు ఆమీ తన ఇన్‌స్టాలో పోస్టు చేసింది. ఆ ఇద్దరూ వెడ్డింగ్ వీడియోను కూడా షేర్ చేశారు. పెళ్లికి చెందిన ఫస్ట్ పిక్‌ను ఆ ఇద్దరూ షేర్ చేశారు. జర్నీ ఇప్పుడే మొదలైందని ఆ ఫోటోకు క్యాప్షన్ ఇచ్చారు. ఈ ఏడాది జనవరిలో స్విట్జర్లాండ్‌లోని జీస్టాడ్లో ఆమీ జాక్సన్‌కు ఎడ్ వెస్ట్విక్ ప్రపోజ్ చేశాడు.