సబలెంకా x రిబాకినా
ఈ ఏడాది టెన్నిస్ ఆరంభ సీజన్ టోర్నీ అయిన ఆస్ట్రేలియా ఓపెన్ మహిళల సింగిల్స్‌లో ఫైనల్లో ఢీకొన్న అరీనా సబలెంకా (బెలారస్), ఎలీనా రిబాకినా (కజకిస్థాన్) మరోసారి టైటిల్ పోరులో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు.
- టైటిల్ పోరుకు సై సెమీస్‌లోనే ఓడిన బాంబ్రీ జోడీ
ఇండియన్ వెల్స్: ఈ ఏడాది టెన్నిస్ ఆరంభ సీజన్ టోర్నీ అయిన ఆస్ట్రేలియా ఓపెన్ మహిళల సింగిల్స్‌లో ఫైనల్లో ఢీకొన్న అరీనా సబలెంకా (బెలారస్), ఎలీనా రిబాకినా (కజకిస్థాన్) మరోసారి టైటిల్ పోరులో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ ఇద్దరూ బీఎన్పీ పారిబాస్ ఓపెన్ (ఇండియన్ వెల్స్) టోర్నీలో ఫైనల్‌కు చేరారు. మహిళల సింగిల్స్ సెమీస్‌లో టాప్ సీడ్ సబలెంకా.. 6-3, 6-4తో లిండా నొస్కొవ (చెక్)పై సునాయస విజయం సాధించింది.
గడిచిన నాలుగేండ్లలో ఆమెకు ఇది మూడో ఫైనల్ కావడం విశేషం. రెండో సెమీస్‌లో రిబాకినా.. 7-5, 6-4తో స్వితోలినా (ఉక్రెయిన్)ను చిత్తుచేసి సబలెంకాతో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమైంది. ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్లో ఈ ఇద్దరి మధ్య జరిగిన ఫైనల్లో రిబాకినానే అదృష్టం వరించిన విషయం తెలిసిందే.
కాగా పురుషుల డబుల్స్‌లో భారత ఆటగాడు యూకీ బాంబ్రీ జోడీ పోరాటం సెమీస్‌కే పరిమితమైంది. తొలిసారి ఏటీపీ మాస్టర్స్ 1000 టోర్నీలో సెమీస్‌కు చేరిన బాంబ్రీ, గొరన్సన్ (స్వీడన్) జోడీ.. 5-7, 7-6 (7/3) 5-10తో ఆర్థర్ రిండర్‌నెక్ (ఫ్రాన్స్), వాలెంటిన్ (మొనాకో) చేతిలో ఓడింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Power crisis | కాంగ్రెస్ చేతకాని పాలనతో రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం : మాజీ ఎమ్మెల్యే గండ్ర
President Murmu | మహిళలకు మరింత సాధికారత కల్పించేందుకు కృషి చేయాలి : రాష్ట్రపతి ముర్ము
Supreme Court | సీఈసీ జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. జంతర్ మంతర్‌పై ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులు
Kalpavruksha Vahanam | కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి దర్శనం..తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు
Lover | ప్రియుడికి బెయిల్ ఇప్పించేందుకు ప్రియురాలు ఏం చేసిందో తెలుసా..?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

