న్యూఢిల్లీ: చైనాకు చెందిన వోల్ట్ టైఫూన్ హ్యాకింగ్(Chinese hackers) గ్రూపు.. భారత్, అమెరికా ఇంటర్నెట్ కంపెనీలపై అటాక్ చేస్తున్నది. నాలుగు అమెరికా కంపెనీల్లోకి వోల్ట్ టైఫూన్ హ్యాక్ చేసిందని సెక్యూర్టీ పరిశోధకులు తెలిపారు.వర్సా నెట్వర్క్స్ సర్వర్ పై అటాక్ జరిగినట్లు లుమెన్ టెక్నాలజీస్ కంపెనీ తెలిపింది. వోల్ట్ టైఫూన్ గ్రూప్ ఆ హ్యాక్ చేసినట్లు ఓ బ్లాగ్‌లో రాశారు. వోల్ట్ హ్యాకింగ్‌పై వాషింగ్టన్‌లోని చైనా ఎంబసీ ప్రతినిధి లియూ పెన్గుయి స్పందించారు.
వోల్ట్ టైఫూన్ ఓ రాన్సమ్వేర్ సైబర్ క్రిమినల్ గ్రూప్ అని, దాన్ని డార్క్పవర్గా పిలుస్తారని,కానీ ఆ సంస్థకు ఎటువంటి ప్రభుత్వ లింకులు లేవని లియూ తెలిపారు. దాదాపు అయిదేళ్ల నుంచి ఎనర్జీ, కమ్యూనికేషన్స్, ట్రాన్స్‌పోర్టేషన్ సిస్టమ్స్, వాటర్, వేస్ట్‌వాటర్ సిస్టమ్స్‌పై వోల్ట్ టైఫూన్ అటాక్ చేసినట్లు అమెరికాకు చెందిన సీఐఎస్ఏ, నేషనల్ సెక్యూర్టీ ఏజెన్సీ, ఎఫ్‌బీఐ వెల్లడించాయి.