భోపాల్: ఒక లారీ అదుపుతప్పింది. ఆటోపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణించిన ఏడుగురు యాత్రికులు మరణించారు. (pilgrims dead) మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఎనిమిది మంది యాత్రికులు ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లారు. గంగా నదిలో పవిత్ర స్నానమాచరించారు. ఆటోలో తిరిగి వెళ్తుండగా ప్రమాదం బారిన పడ్డారు.
కాగా, గురువారం తెల్లవారుజామున జాతీయ రహదారి 30లోని సోహాగి లోయ వద్ద లారీ అదుపుతప్పింది. యాత్రికులు ప్రయాణించిన ఆటో మీదకు దూసుకెళ్లి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఆటో నుజ్జయ్యింది. అందులో ప్రయాణించిన ఎనిమిది మంది యాత్రికుల్లో ఏడుగురు మరణించారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడగా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: