లక్నో: బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి (Mayawati) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్‌లో బీఎస్పీ అభ్యర్థుల గెలుపును అడ్డుకునేందుకు ఈవీఎంలను తారుమారు చేశారని ఆరోపించారు. అలాగే బ్యాలెట్ పేపర్ ఓటింగ్‌ను తిరిగి ప్రవేశపెట్టాలని మరోసారి డిమాండ్ చేశారు. లక్నోలో మీడియా సమావేశంలో మాయావతి మాట్లాడారు. ‘ఈవీఎంలు నమ్మదగినవి కావు. బ్యాలెట్ పేపర్ల ద్వారా ఎన్నికలు నిర్వహిస్తే బీఎస్పీ గెలుస్తుంది. ప్రస్తుత ప్రభుత్వం ఈ మార్పును అనుమతించదు. ఎందుకంటే వారు ఈ వ్యవస్థ నుంచి ప్రయోజనం పొందుతారు’ అని విమర్శించారు.
కాగా, దళితులు, అణగారిన వర్గాలలో బీఎస్పీకి బలమైన మద్దతు ఉందని మాయావతి తెలిపారు. అయితే తమ పార్టీని బలహీనపరిచేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీలు క్రమపద్ధతిలో పనిచేస్తున్నాయని, కుట్రలకు పాల్పడుతున్నాయని ఆమె ఆరోపించారు. కొత్త పార్టీల ఏర్పాటుతో ఈ వర్గం ప్రజలను విభజించి వారిని తప్పుదారి పట్టించడమే వారి ఏకైక లక్ష్యమని విమర్శించారు.
మరోవైపు పహల్గామ్ ఉగ్రదాడిపై మాయావతి స్పందించారు. దేశ సరిహద్దులు సురక్షితంగా లేవని ఆరోపించారు. అందుకే ఇలాంటి ఉగ్రవాద దాడులు జరుగుతున్నాయని తెలిపారు. మూలకారణాన్ని పరిష్కరించడానికి బదులుగా, రాజకీయ పార్టీలు ఇప్పుడు పహల్గామ్ సంఘటనను తమ ప్రయోజనం కోసం రాజకీయం చేస్తున్నాయని ఆమె మండిపడ్డారు.
#WATCH | Lucknow, UP | Bahujan Samaj Party (BSP) President Mayawati says, “These casteist parties are even rigging EVMs to prevent BSP candidates from winning elections… Along with many other Opposition parties, our party also wants all elections in the country to be conducted… https://t.co/p05zMWxJLE pic.twitter.com/gvCEECj36m
— ANI (@ANI) June 5, 2025
Also Read: