బుధవారం 03 జూన్ 2020
National - May 09, 2020 , 19:36:22

తమిళనాడులో కొత్తగా 526 కరోనా కేసులు

తమిళనాడులో కొత్తగా 526 కరోనా కేసులు

చెన్నై: వరుసగా రెండో రోజూ తమిళనాడులో ఐదువందలకు పైగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఈ రోజు కొత్తగా 526 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో రాజధాని నగరం చెన్నైలోనే 279 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 6535కి చేరింది. ప్రణాంతక వైరస్‌ ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నలుగురు మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 44కి పెరిగింది. కొయంబేడు మార్కెట్‌ ద్వారా ఇప్పటివరకు 1,867 కరోనా కేసులు నమోదయ్యాయి. చెన్నైలో ఐదు రోజుల చిన్నారికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. 


logo