Heatwave | దేశరాజధాని ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. సాధారణం కంటే గరిష్ఠ స్థాయిలోనే ఉష్ణోగ్రతలు (Heatwave) నమోదవుతున్నాయి. దీంతో ఉక్కపోతకు ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇక వేడిగాలుల కారణంగా వడదెబ్బకు ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. ఈ వేసవిలో హీట్‌వేవ్స్ కారణంగా ఉత్తరాది రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో సుమారు 41 మంది ప్రాణాలు కోల్పోయారు.
వడదెబ్బ కారణంగా బీహార్ రాష్ట్రంలో 20 మంది మృత్యువాత పడ్డారు. వీరిలో ఔరంగాబాద్‌లో 12 మంది కాగా, అర్రాలో ఆరుగురు, బక్సర్‌లో ఇద్దరు మరణించారు. ఇక ఒడిశాలోని రూర్కెలాలో 10 మంది, జార్ఖండ్‌లోని పాలములో ఐదుగురు, రాజస్థాన్‌లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్‌లో ఒకరు వడదెబ్బకు గురై మరణించినట్లు అధికారులు తెలిపారు.
భారత వాతావరణ శాఖ (Indian Meteorological Department) తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్థాన్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఒడిశా, తూర్పు మధ్యప్రదేశ్, విదర్భలోని అనేక ప్రాంతాల్లో గురువారం గరిష్ట ఉష్ణోగ్రతలు 45-48 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యాయి. పశ్చిమ మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, కోస్తాంధ్ర, యానాం, గుజరాత్, తెలంగాణ, రాయలసీమల్లోని అనేక ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 42-45 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యాయి. ఇక మే 31, జూన్ 1 తేదీల్లో పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఒడిశాలో ఎండ తీవ్రత సాధారణం కంటే ఎక్కువగా ఉంటుందని ఐంఎడీ అంచనా వేసింది.
Also Read..
Air Hostess | రహస్య భాగాల్లో దాచి బంగారం స్మగ్లింగ్.. ఎయిర్‌హోస్ట్ అరెస్ట్
Amit Shah | తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అమిత్ షా దంపతులు
Virat Kohli | అమెరికా ఫ్లైట్ ఎక్కిన విరాట్ కోహ్లీ.. రేపటి నుంచే టీ20 ప్రపంకప్ షురూ