Virat Kohli | ఐపీఎల్ 2024 ముగిసిందో లేదో.. మరో మెగా క్రికెట్ టోర్నీ అభిమానులను అలరించేందుకు సిద్ధమైంది. టీ 20 వరల్డ్ కప్ 2024 (T20 World Cup 2024) రేపటి నుంచి ప్రారంభం కాబోతున్న విషయం తెలిసిందే. జూన్ 1న ఆరంభ వేడుకలతో వరల్డ్ కప్ టోర్నీ షురూ కానుంది. దీంతో ఇప్పటికే అన్ని జట్లు టీ20 సమరానికి సిద్ధమయ్యాయి. ఇక టీమ్ ఇండియా గత వారమే అమెరికా చేరుకుంది. హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్‌తోపాటు కెప్టెన్ రోహిత్ శర్మ, రిషభ్ పంత్, శివం దూబే, కుల్దీప్ యాదవ్, సిరాజ్‌లు న్యూయార్క్ చేరుకున్నారు. అయితే స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) మాత్రం వెళ్లలేదు. దీంతో అతడు జూన్ 1 న బంగ్లాదేశ్‌తో జరగనున్న వామప్ మ్యాచ్‌కు (warm-up game) దూరం కానున్నాడంటూ వార్తలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో తాజాగా టీ20 కోసం విరాట్ అమెరికా ఫ్లైట్ ఎక్కేశాడు. గురువారం సాయంత్రం ముంబై ఎయిర్పోర్ట్ (Mumbai Airport)లో కోహ్లీ దర్శనమిచ్చాడు. కోహ్లీని చూసిన అభిమానులు అతడిని చుట్టుముట్టి ఫొటోలు, ఆటోగ్రాఫ్‌ల కోసం ఎగబడ్డారు. కోహ్లీ ఎయిర్‌పోర్ట్‌లో ఉన్న ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. అయితే, జూన్1 న జరిగే వామప్ మ్యాచ్‌లో కోహ్లీ ఆడతాడో లేదో అన్నదానిపై క్లారిటీ లేదు.
Virat Kohli giving autograph to fans at the airport. 👏
Nice Gesture by King Kohli 👑❤️ pic.twitter.com/FPRvP0FaBv
— Virat Kohli Fan Club (@Trend_VKohli) May 30, 2024
టీ20 ప్రపంకచ్కు భారత స్క్వాడ్
రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వీ జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్, విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్(వికెట్ కీపర్), సంజూ శాంసన్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, శివం దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, సిరాజ్.
Also Read..
Amit Shah | తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అమిత్ షా దంపతులు
PM Modi | సాధువు అవతారమెత్తి.. ప్రశాంత వాతావరణంలో మోదీ ధ్యానం.. వీడియోలు
T20 World Cup | అందరి కండ్లు దాయాదుల పోరుపైనే..!