Ramban | జమ్ము కశ్మీర్ (Jammu and Kashmir) రాంబన్ (Ramban) జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అమర్నాథ్ యాత్రికులతో (Amarnath Pilgrims) వెళ్తున్న ఐదు బస్సులు ఒకదానికొకటి ఢీ కొన్నాయి (5 Buses Collide). ఈ ఘటనలో పదుల సంఖ్యలో భక్తులు గాయపడ్డారు.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. అమర్నాథ్ యాత్రికులతో శనివారం ఉదయం జమ్ములోని భగవతి నగర్ నుంచి దక్షిణ కశ్మీర్‌లోని పహల్గాం బేస్ క్యాంప్‌కు దాదాపు ఐదు బస్సులు బయల్దేరాయి. ఈ క్రమంలో జమ్ము-శ్రీనగర్ జాతీయ రహదారి వెంబడి చందర్‌కూట్ సమీపంలోకి రాగానే బస్సులు ఒకదానికొకటి బలంగా ఢీ కొన్నాయి. ఈ ఘటనలో కనీసం 36 మంది అమర్నాథ్ యాత్రికులు గాయపడ్డారు. ఓ బస్సు బ్రేకులు ఫెయిల్ కావడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే అక్కడికి చేరుకొని పరిస్థితి పరిశీలించారు. గాయపడ్డవారిని చికిత్స నిమిత్తం రాంబన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనతో ఆ రహదారిపై కొద్దిసేపు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
#WATCH | The last vehicle of the Pahalgam convoy lost control and hit stranded vehicles at the Chanderkot Langer site, damaging 4 vehicles and causing minor injuries to 36 Yatris. The injured have been immediately shifted to DH Ramban: Deputy Commissioner (DEO), Ramban
(Visuals… pic.twitter.com/dZtrcFS6Bd
— ANI (@ANI) July 5, 2025
Also Read..
snake like bridge | పాములా మెలికలు తిరిగిన బ్రిడ్జ్.. భోపాల్‌లో వెలుగులోకి మరో ప్రమాదకరమైన వంతెన
Pilot Collapses | టేకాఫ్‌కు ముందు కాక్‌పిట్‌లో కుప్పకూలిన పైలట్.. షాకింగ్ ఘటన
Uttarakhand CM | రైతుగా మారి.. పొలాన్ని దుక్కి దున్నిన సీఎం.. VIDEO