Pilot Collapses | బెంగళూరు (Bengaluru) ఎయిర్‌పోర్ట్‌లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఎయిర్ ఇండియా (Air India)కు చెందిన విమానం మరికాసేపట్లో టేకాఫ్ అవుతుందనంగా కాక్‌పిట్‌లో పైలట్ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు (Pilot Collapses). అప్రమత్తమైన సిబ్బంది పైలట్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించారు.
ఎయిర్ ఇండియా ప్రతినిధి తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీకి వెళ్లాల్సిన (Delhi bound plane) ఎయిర్ ఇండియా విమానం AI2414 బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో సిద్ధంగా ఉంది. టేకాఫ్‌కు కొద్దిసేపటి ముందు పైలట్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అప్రమత్తమైన సిబ్బంది పైలట్‌ను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పైలట్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. అతను వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు ఎయిర్ ఇండియా ప్రతినిధి వెల్లడించారు.
ఈ ఘటనతో శుక్రవారం తెల్లవారుజామున ఢిల్లీకి రావాల్సిన విమానం ఆలస్యమైంది. ఎయిర్‌లైన్స్ కాక్‌పిట్ సిబ్బందిలోని మరో సభ్యుడు పైలట్ బాధ్యతలు తీసుకున్నట్లు సదరు అధికారి తెలిపారు. ‘జులై 4న తెల్లవారుజామున ఢిల్లీకి చేరుకోవాల్సి ఎయిర్ ఇండియా విమానం ఆలస్యమైంది. మా పైలట్లలో ఒకరికి వైద్యపరమైన అత్యవసర పరిస్థితి ఏర్పడింది. వెంటనే అతడిని స్థానికి ఆసుపత్రికి తరలించాం. అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. వైద్యలు పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది’ అని ఎయిర్ ఇండియా ప్రతినిధి తెలిపారు.
Also Read..
Uttarakhand CM | రైతుగా మారి.. పొలాన్ని దుక్కి దున్నిన సీఎం.. VIDEO
Texas | టెక్సాస్‌ను ముంచెత్తిన వరదలు.. 24 మంది మృతి