బుధవారం 27 జనవరి 2021
National - Dec 04, 2020 , 10:55:23

కొత్త‌గా 36,594 మందికి సోకిన క‌రోనా

కొత్త‌గా 36,594 మందికి సోకిన క‌రోనా

హైద‌రాబాద్‌:  దేశంలో కొత్త‌గా గ‌త 24 గంట‌ల్లో 36,594 మందికి నోవెల్ క‌రోనా వైర‌స్ సంక్ర‌మించింది. దీంతో దేశ‌వ్యాప్తంగా మొత్తం వైర‌స్ కేసుల సంఖ్య 95,71,559కి చేరుకున్న‌ది. గ‌త 24 గంట‌ల్లో 540 మంది మ‌ర‌ణించారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు చ‌నిపోయిన వారి సంఖ్య 1,39,188కి చేరుకున్న‌ది.  మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,16,082గా ఉంది.  ఇప్ప‌టి వ‌ర‌కు వైర‌స్ బారిన ప‌డి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 90,16,289గా ఉంది.  గ‌త 24 గంట‌ల్లో 42,916 మంది కొత్త‌గా డిశ్చార్జ్ అయ్యారు. logo