Indore | మధ్యప్రదేశ్ ఇండోర్‌లో (Indore) షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అనారోగ్యంతో ఆసుపత్రికి వచ్చిన ఓ వ్యక్తి.. వైద్యుడి ఎదుటే గుండెపోటుతో (heart attack ) కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనకు సంబంధించిన షాకింగ్ వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్ అవుతోంది.
ఇండోర్‌లోని పరదేశిపుర ప్రాంతానికి చెందిన 31 ఏళ్ల సోను మట్కర్ (Sonu Matkar) అనే వ్యక్తి అకస్మాత్తుగా ఛాతిలో నొప్పి రావడంతో ఆసుపత్రికి (hospital) వెళ్లాడు. అక్కడ వైద్యుడు మట్కర్ను చెక్ చేస్తుండగా.. గుండెపోటుకు గురై ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయాడు. దీంతో డాక్టర్ వెంటనే సీపీఆర్ చేశాడు. అయినా ఫలితం లేదు. దురదృష్టవశాత్తూ అక్కడే ప్రాణాలు వదిలాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ఆసుపత్రిలోని సీసీటీవీలో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది. మరోవైపు ఈ ఘటనపై పరదేశిపుర పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
The patient experienced a hear tattack in front of the doctor during a checkup in Indore after feeling anxious.
CPR was administered, but unfortunately, his life couldn’t be saved.#SuddenDeath #DiedSuddenly#HeartAttack #Indore #India
— Mr. Shaz (@Wh_So_Serious) August 18, 2024
Also Read..
DK Shivakumar | సిద్ధరామయ్య అమాయకుడు.. బీజేపీ రాజకీయ డ్రామా చేస్తోంది: ముడా స్కామ్‌పై డీకే శివకుమార్
Safety Of Doctors | ఆసుపత్రుల్లో వైద్యుల భద్రతకు కీలక సూచనలు చేసిన సుప్రీంకోర్టు