అహ్మదాబాద్: స్కూటీపై వెళ్తున్న మహిళను ట్రాఫిక్ పోలీసులు ఆపారు. దీంతో ట్రాఫిక్ పోలీస్ ఐడీని ఆ మహిళ అడిగింది. వాగ్వాదం సందర్భంగా పొరపాటున అది కిందపడింది. ఈ నేపథ్యంలో ఆ ట్రాఫిక్ పోలీస్ అధికారి రెచ్చిపోయాడు. ఆ మహిళను దారుణంగా కొట్టాడు. (Police Brutally Slaps Woman) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఈ సంఘటన జరిగింది. రాత్రి వేళ పాల్డిలోని నెహ్రూ నగర్ క్రాస్‌రోడ్స్ వద్ద స్కూటీపై వెళ్తున్న మహిళను ట్రాఫిక్ పోలీసులు ఆపారు. అయితే పోలీస్ అధికారి గుర్తింపు కార్డును చూపించమని ఆమె అడిగింది. నేమ్ ప్లేట్ పరిశీలిస్తుండగా వాదన సమయంలో అది కిందపడింది.
కాగా, ఆ ట్రాఫిక్ పోలీస్ అధికారి రెచ్చిపోయాడు. కోపంతో ఆమెపై దాడి చేశాడు. ఆ మహిళ ముఖం, చెంపపై పలుసార్లు కొట్టాడు. ఆ పోలీస్ అధికారిని నిలువరించేందుకు పలువురు ప్రయత్నించారు. ఈ దాడిలో ఆ మహిళ కంటికి గాయమైంది.
మరోవైపు ఆ ట్రాఫిక్ పోలీస్ అధికారి దౌర్జన్యంపై ఫిర్యాదు చేసేందుకు ఆ మహిళ పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. అయితే ఆమె నుంచి ఫిర్యాదు తీసుకునేందుకు పోలీసులు నిరాకరించారు. ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాలని చెప్పారు. కాగా, ట్రాఫిక్ పోలీస్ అధికారి మహిళను కొట్టిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఆ అధికారి ప్రవర్తనపై విమర్శలు వెల్లువెత్తాయి.
Seeing the Ahmedabad police behave like this with women makes one’s blood boil!
A Gujarati sister asks a police officer for his ID card. The ID slips from her hand and falls on the road – and this becomes her “crime”! Then this khaki-clad goon slaps her and draws blood!
What is… pic.twitter.com/hrTJKYbo10— Jignesh Mevani (@jigneshmevani80) December 20, 2025
Also Read:
differently-abled Boy Thrashed | దివ్యాంగ బాలుడ్ని కొట్టి.. కంట్లో కారం చల్లిన స్కూల్ నిర్వాహకులు
Watch: లైవ్ టీవీ చర్చలో ఘర్షణ.. కొట్టుకున్న రామ్‌దేవ్ బాబా, ప్యానలిస్ట్