బెంగళూరు: దివ్యాంగ బాలుడ్ని స్కూల్ నిర్వాహకుడు దారుణంగా కొట్టాడు. అతడి భార్య మరింత దారుణానికి పాల్పడింది. దివ్యాంగ బాలుడి కంట్లో కారం చల్లింది. ఈ వీడియో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో అధికారులు చర్యలు చేపట్టారు. (differently-abled Boy Thrashed) ఉత్తర కర్ణాటకలోని బాగల్కోట్లో ఈ సంఘటన జరిగింది. నవగర్ ప్రాంతంలో దివ్యాంగ పిల్లలకు సంబంధించిన దివ్యజ్యోతి వికలాంగ పిల్లల స్కూల్ ఉన్నది.
కాగా, ఆ స్కూల్ నిర్వాహకుడు అక్షయ్ ఇందుల్కర్ 16 ఏళ్ల దివ్యాంగ బాలుడ్ని దారుణంగా కొట్టాడు. ప్లాస్టిక్ పైప్‌తో చితకబాదాడు. ఆ బాలుడు నేలపై పడి నొప్పితో ఏడుస్తున్నప్పటికీ కనికారం చూపలేదు. అక్షయ్ భార్య ఆనంది మరింత దారుణానికి పాల్పడింది. లోపలకు వెళ్లి కారం పొడి తెచ్చింది. ఆ దివ్యాంగ బాలుడి కళ్లల్లో కారం చల్లింది.
మరోవైపు ఆ వికలాంగ స్కూల్‌కు చెందిన ఒక వ్యక్తి దీనిని మొబైల్ ఫోన్లో రికార్డ్ చేశాడు. దీంతో ఇది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. వికలాంగ పిల్లల పాఠశాలల్లో పర్యవేక్షణ, భద్రత, జవాబుదారీతనంపై ప్రశ్నలు లేవనెత్తాయి. ఈ నేపథ్యంలో అధికారులు స్పందించారు.
కాగా, ఆ బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. అక్షయ్, అతడి భార్య ఆనందితోపాటు మరో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
Trigger Warning ⚠️
A differently abled boy mercilessly thrashed, chilli powder thrown into his eyes as bystanders laugh and other kids watch in horror.
Akshay & his wife Anandi who run this school for the differently abled in Bagalkot are seen assaulting the child in the video. A… pic.twitter.com/e0f76QMl0w— Deepak Bopanna (@dpkBopanna) December 20, 2025
Also Read:
Watch: లైవ్ టీవీ చర్చలో ఘర్షణ.. కొట్టుకున్న రామ్‌దేవ్ బాబా, ప్యానలిస్ట్
Watch: దోమలు కుట్టాయని.. ఒక వ్యక్తి ఏం చేశాడంటే?