న్యూఢిల్లీ: యోగా గురువు రామ్‌దేవ్ బాబా, ప్యానలిస్ట్ మధ్య టీవీ చర్చా కార్యాక్రమంలో తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో వారిద్దరూ ఘర్షణ పడ్డారు. లైవ్‌లో పంచ్‌లు కురిపించి, నేలపైకి తోసుకుని కొట్టుకున్నారు. (Ramdev Baba, Panelist Clash) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అమర్ ఉజాలా టీవీలో లైవ్ డిబేట్ సందర్భంగా రామ్‌దేవ్ బాబా, ఒక ప్యానలిస్ట్ మధ్య వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో తన బలాన్ని ప్రదర్శించేందుకు రామ్‌దేవ్ బాబా ప్రయత్నించారు. చర్చలో పాల్గొన్న వ్యక్తితో నేరుగా తలపడ్డారు. ఆయనను కిందకు నెట్టేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా ప్యానలిస్ట్‌పై ఆయన పంచులిచ్చారు.
కాగా, చర్చలో పాల్గొన్న వ్యక్తి కూడా ధీటుగా తన బలాన్ని ప్రదర్శించాడు. రామ్‌దేవ్ బాబాపై ఎదురుదాడి చేశాడు. ఆయన పైకి లేవకుండా గట్టిగా ప్రయత్నించాడు. దీంతో రామ్‌దేవ్ బాబా వెనక్కి తగ్గారు. సరదా, హాస్యం కోసమే ఇలా చేసినట్లు చెప్పారు. దీనిని మరో విధంగా పరిగణించవద్దని కోరారు.
మరోవైపు ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో రామ్‌దేవ్ బాబాపై పలువురు కామెంట్లు చేశారు. నెయ్యి వంటి పతంజలి ఉత్పత్తులను వ్యంగ్యంగా విమర్శించారు. ఆయనను ‘స్కామ్‌దేవ్’ అని కొందరు ఆరోపించారు. ఇలాంటి టీవీ కార్యక్రమాలు నిర్వహించడంపై మరి కొందరు మండిపడ్డారు.
न्यूज चैनलों के मंच दंगल में बदल गए हैं।
लोगों को कहते सुना था, आज देख भी लिया। pic.twitter.com/EMtwiePLZQ
— Govind Pratap Singh | GPS (@govindprataps12) December 20, 2025
Also Read:
Watch: దోమలు కుట్టాయని.. ఒక వ్యక్తి ఏం చేశాడంటే?
Watch: పోలీస్ వ్యాన్ నుంచి తప్పించుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: అత్త కాళ్లపై పడిన వ్యక్తి.. భార్యను ఇంటికి పంపాలని వేడుకోలు