రాయ్‌పూర్: ఒక వ్యక్తిని దోమలు కుట్టాయి. డెంగీ దోమలుగా అతడు అనుమానించాడు. వాటిని చంపి చిన్న కవర్లో ప్యాక్ చేశాడు. (Man Delivers Mosquitoes) డాక్టర్ సలహా మేరకు చంపిన దోమల ప్యాకెట్‌ను మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి తీసుకెళ్లాడు. వాటిని పరీక్షించాలని కోరాడు. ఇది చూసి అధికారులు షాక్ అయ్యారు. ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో ఈ సంఘటన జరిగింది. వామన్రావ్ లాఖే వార్డులో నివసించే దౌలాల్ పటేల్‌ను దోమలు కుట్టాయి. అయితే అవి డెంగీ దోమలుగా అతడు ఆందోళన చెందాడు. ఈ నేపథ్యంలో ఆ దోమలను చంపి ప్లాస్టిక్ కవర్లో ప్యాక్ చేశాడు.
కాగా, దౌలాల్ పటేల్ తొలుత డాక్టర్ వద్దకు వెళ్లాడు. చంపిన దోమలను చూపించాడు. తనను కుట్టిన ఆ దోమలు డెంగీ వ్యాపించేవి కావచ్చని అనుమానం వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలో ఆ దోమలను పరీక్షించాలని ఆ డాక్టర్ సలహా ఇచ్చాడు.
మరోవైపు దౌలాల్ పటేల్ దీనిని సీరియస్‌గా తీసుకున్నాడు. సామాజిక కార్యకర్త విజయ్ సోనా, మున్సిపల్ కార్పొరేషన్ ప్రతిపక్ష నేత ఆకాష్ తివారీతో కలిసి రాయ్‌పూర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి వెళ్లాడు. అక్కడ ఆరోగ్య అధికారిని కలిశాడు. తనను కుట్టిన దోమలను చంపి ప్యాక్ చేసిన కవర్‌ను ఆ అధికారికి దౌలాల్ అందజేశాడు. అవి డెంగీ వ్యాపించే దోమలో కావో అన్నది పరీక్షించాలని కోరాడు.
కాగా, చచ్చిన దోమల ప్యాకెట్ చూసి ఆ అధికారి తొలుత షాక్ అయ్యాడు. అయితే ఆ దోమలను ఆయన పరీక్షించాడు. అవి సాధారణ దోమలేనని, డెంగీ వ్యాపించేవి కావని చెప్పాడు. దీంతో దౌలాల్ పటేల్ ఊరట చెందాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Unique Complaint
In Raipur, Chhattisgarh, a man was bitten by a mosquito and suspected it was a dengue mosquito.
So then,he killed the mosquito, packed it in plastic, and went straight to the municipal corporation office.This unique complaint by the man has now become a topic… pic.twitter.com/3CGCXhD2v7
— Atulkrishan (@iAtulKrishan1) December 20, 2025
Also Read:
Woman Gang Raped | హోటల్లో తప్పుడు రూమ్ తట్టిన మహిళ.. ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారం
Watch: వీధిలో ఆడుతున్న బాలుడు.. ‘ఫుట్‌బాల్’ మాదిరిగా తన్నిన వ్యక్తి