ఢిల్లీ లిక్కర్పాలసీ కేసుపై హైకోర్టులో విచారణ
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించి సీబీఐ వేసిన అప్పీల్ పిటిషన్పై ఢిల్లీ హైకోర్టులో సోమవారం వా దనలు జరిగాయి. లిక్కర్ పాలసీపై స రైన ఆధారాలు లేవంటూ ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టు ఆ కేసును కొట్టివేసి, నిందితులందరికీ క్లీన్చిట్ ఇచ్చిన విష యం తెలిసిందే.
హైదరాబాద్, మార్చి 9(నమస్తే తెలంగాణ): ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించి సీబీఐ వేసిన అప్పీల్ పిటిషన్పై ఢిల్లీ హైకోర్టులో సోమవారం వా దనలు జరిగాయి. లిక్కర్ పాలసీపై స రైన ఆధారాలు లేవంటూ ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టు ఆ కేసును కొట్టివేసి, నిందితులందరికీ క్లీన్చిట్ ఇచ్చిన విష యం తెలిసిందే. ఆ తీర్పుపై సీబీఐ హై కోర్టుకు వెళ్లింది. సీబీఐ తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ఈ కేసులో దర్యాప్తు అధికారిపై చర్యలు తీసుకోవాలంటూ ప్రత్యేక కోర్టు చేసిన వ్యాఖ్యలపై హైకోర్టు స్టే విధించింది. ఈ కేసులో ప్రతివాదులకు నోటీసులు జారీచేసిం ది. తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు పిటిషనర్లు, ప్రతివాదులు పూర్తి సాక్ష్యాధారాలతో సిద్ధంగా ఉండాలని సూచించింది.
ఇంకా చదవల్సిన వార్తలు
ఎన్నికలకు వెళ్లడం సరికాదు ; హెచ్సీఏ తీరుపై సభ్యుల ఆగ్రహం
హైదరాబాద్, మార్చి 9(నమస్తే తెలంగాణ): అంబుడ్స్మన్ తీర్పుపై హైకోర్టులో కేసు విచారణలో ఉన్నప్పటికీ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి, కోశాధికారి పదవులకు ఎన్నికలు నిర్వహించడం సరికాదని హెచ్సీఏ సభ్యులు ధ్వజమెత్తారు. గతంలో అప్పటి ఆఫీస్ బేరర్లయిన ముగ్గురు వ్యక్తులపై ఫిర్యాదులు వచ్చినప్పటికీ అధ్యక్షుడి స్థానంపై మాత్రమే అంబుడ్స్మన్ తీర్పు ఇచ్చి, ఓడిపోయిన వ్యక్తిని కొత్త అధ్యక్షుడిగా ప్రకటించారని, ఈ నిర్ణయంపై దాఖలు చేసిన వ్యాజ్యాన్ని హైకోర్టు విచారణకు స్వీకరించిందని చెప్పారు. తొలుత ఈ నెల 12న ఎన్నికలు నిర్వహించనున్నట్టు ప్రకటించిన హెచ్సీఏ.. ఇప్పుడు వాటి ని అకస్మాత్తుగా 15కి వాయిదా వేసిందని మండిపడ్డారు. అడ్మినిస్ట్రేటర్ ఆ మోదం, పర్యవేక్షణ లేకుండానే ఓటరు జాబితా తయారీ సహా మొత్తం ఎన్నికల ప్రక్రియను చేపట్టినట్టు పేర్కొన్నా రు. 2023 అక్టోబర్ 20న జరిగిన హెచ్సీఏ ఎన్నికలకు ముందు అర్హత కలిగిన సభ్య సంఘాలను నిర్ణయించి, ఓటు హకు మంజూరు చేసేందుకు జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు (రిటైర్డ్) సమగ్ర నిబంధనలు రూపొందించారని, దీనికి విరుద్ధంగా ఇప్పుడు ఎన్నికల ప్రక్రియ జరుగుతున్నదని సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

