ముంబై: ఒక మహిళ హోటల్‌కు వెళ్లి ఫ్రెండ్‌ను కలిసింది. ఆ తర్వాత పొరపాటున ఆ హోటల్లోని మరో రూమ్ నాక్ చేసింది. అందులో మందు పార్టీ చేసుకున్న ముగ్గురు వ్యక్తులు ఆ మహిళను లోపలకు లాక్కెళ్లారు. ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. (Woman Gang Raped) మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ నగర్లో ఈ సంఘటన జరిగింది. 30 ఏళ్ల మహిళ ప్రైవేట్ ఆసుపత్రిలో పని చేస్తున్నది. గురువారం రాత్రి ఫ్రెండ్ నుంచి డబ్బులు తీసుకునేందుకు హోటల్‌కు వెళ్లింది. రూమ్ నంబర్ 105లో ఉన్న ఫ్రెండ్‌ను కలిసింది.
కాగా, ఫ్రెండ్ రూమ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ మహిళ పొరపాటున హోటల్ రెండో అంతస్తు చేరుకున్నది. గందరగోళంలో ఉన్న ఆమె రూమ్ నంబర్ 205 డోర్ తట్టింది. ముగ్గురు వ్యక్తులు అందులో మందు పార్టీ చేసుకుంటున్నారు. మద్యం మత్తులో ఉన్న ఆ ముగ్గురు ఆ మహిళను రూమ్‌లోకి లాక్కెళ్లారు. ఆమెతో బలవంతంగా బీరు తాగించారు. ఆ తర్వాత రాత్రంతా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
మరోవైపు తెల్లవారుజామున 3-4 గంటల సమయంలో మహిళ ఆ రూమ్ నుంచి తప్పించుకున్నది. నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఆ హోటల్‌కు చేరుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. నిందితులైన ఘనశ్యామ్ భౌలాల్ రాథోడ్, రిషికేశ్ తులసీరామ్ చవాన్, కిరణ్ లక్ష్మణ్ రాథోడ్‌ను అరెస్ట్ చేశారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read:
Watch: పోలీస్ వ్యాన్ నుంచి తప్పించుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?