హైదరాబాద్, మార్చి 9 (నమస్తే తెలంగాణ): మాసబ్‌ట్యాంక్‌లోని ఉన్న త విద్యామండలి కార్యాలయాన్ని ఖాళీచేయాలని జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ(జేఎన్ఏఎఫ్ఏయూ) కోరింది. భవనాన్ని తమకు స్వాధీనం చేయాలని వర్సిటీ ఇటీవలే ఉన్నత విద్యామండలికి లేఖ రాసింది. హైదరాబాద్‌లోని మాసాబ్‌ట్యాంక్‌లో ఉన్నత విద్యామండలికి కార్యాలయం ఉంది. ఇదే భవనంలో తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ) కా ర్యాలయం కూడా ఉంది.
అయితే ఇది సొంత భవనం కాదు. ఫైన్ ఆర్ట్స్ వర్సిటీకి చెందిన భవనం. గతంలో ఈ భవనం మొత్తం కొనుగోలు చేయాలన్న ప్రతిపాదన తెరపైకి వచ్చింది. రూ. 6 కోట్లకు భవనం మొత్తం కొనుగోలు చేసేందుకు సాంకేతిక విద్యాశాఖ సైతం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అయితే ఆ తర్వాత అడ్డంకులు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంతో మండలి సొంత కార్యాలయాన్ని నిర్మించుకోవాలని నిర్ణయం తీసుకున్నది. ఈ నేపథ్యంలోనే అధికారులు స్థలం కేటాయించాలంటూ హైదరాబాద్ కలెక్టర్‌కు లేఖ రాశారు. ఇదిలా ఉండగానే ఫైన్ ఆర్ట్స్ వర్సిటీ మండలి కార్యాలయాన్ని ఖాళీ చేయాలంటూ లేఖ రాసింది. దీంతో మండలి అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు.