రాంచీ: పిక్నిక్ స్పాట్‌కు వెళ్లిన కాలేజీ విద్యార్థుల జంటను ఇద్దరు వ్యక్తులు అడ్డుకున్నారు. గన్‌తో బెదిరించి బలవంతంగా కిస్ చేయించారు. దీనిని రికార్డ్ చేసి డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చేశారు. (College Students Forced To Kiss) విద్యార్థి ఫిర్యాదుతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. జార్ఖండ్‌లోని కోడెర్మా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. డిసెంబర్ 18న కాలేజీ విద్యార్థి పప్పు కుమార్ తన లేడీ క్లాస్‌మేట్‌తో కలిసి ప్రసిద్ధ బృందాహ జలపాతం వద్దకు వెళ్లాడు.
కాగా, ఆ కాలేజీ జంట వద్దకు ఇద్దరు వ్యక్తులు వచ్చారు. అక్కడ ఏం చేస్తున్నారని వారిని నిలదీశారు. గన్‌తో బెదిరించి ముద్దు పెట్టుకోవాలని వారిని బలవంతం చేశారు. దీనిని రికార్డ్ చేశారు. ఆ వీడియో వైరల్ చేయకుండా ఉండేందుకు డబ్బులు డిమాండ్ చేశారు.
అయితే తన వద్ద వంద మాత్రమే ఉన్నదని స్టూడెంట్ పప్పు కుమార్ తెలిపాడు. అయినా వారు వదిలిపెట్టేదు. దీంతో స్నేహితులు, బంధువులకు ఫోన్ చేసి మరో రూ. 635 సేకరించాడు. క్యూఆర్ స్కానర్ ద్వారా దశరథ్ కుమార్ అనే వ్యక్తికి చెల్లించడంతో ఆ వ్యక్తులు వారిని వదిలిపెట్టారు.
కాగా, ఆ తర్వాత విద్యార్థి పప్పు కుమార్‌ను ఆ వ్యక్తులు సంప్రదించారు. మరో రూ.5,000 ఇవ్వాలని లేకపోతే వీడియో క్లిప్‌ను వైరల్ చేస్తామని బ్లాక్మెయిల్ చేశారు. ఈ నేపథ్యంలో ఆ స్టూడెంట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన స్నేహితురాలిని వారు లైంగికంగా వేధించినట్లు ఆరోపించాడు.
మరోవైపు పోలీసులు కేసు నమోదు చేశారు. బబ్లూ యాదవ్, అజిత్ యాదవ్‌ను నిందితులుగా గుర్తించారు. మొబైల్ లొకేషన్, మనీ ట్రాన్సాక్షన్ వివరాల ద్వారా వారి ఆచూకీ గుర్తించి అరెస్ట్ చేశారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.
Also Read:
Watch: పోలీస్ వ్యాన్ నుంచి తప్పించుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: దోమలు కుట్టాయని.. ఒక వ్యక్తి ఏం చేశాడంటే?