బెంగళూరు: ఒక మహిళా డాక్టర్ డ్యూటీ తర్వాత హాస్టల్కు తిరిగి వెళ్తున్నది. బైక్పై వచ్చిన ఒక వ్యక్తి ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆ యువతి అరవడంతో అక్కడి నుంచి పారిపోయాడు. అనంతరం ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. (Bengaluru Doctor Molested) కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. ఒక మహిళ ఎంబీబీఎస్ పూర్తి చేసింది. సప్తగిరి మెడికల్ కాలేజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతున్నది. ఆ హాస్పిటల్లో వైద్య సేవలు అందిస్తున్నది.
కాగా, డిసెంబర్ 17న తెల్లవారుజామున 12:49 సమయంలో లేడీ డాక్టర్ విధుల తర్వాత హాస్పిటల్ నుంచి వసతి గృహానికి తిరిగి వెళ్తున్నది. ఒక వ్యక్తి బైక్పై ఆమె వద్దకు వచ్చాడు. బస్ స్టాప్ ఎక్కడ ఉన్నది అని అడిగాడు. ఒంటరిగా ఉన్న ఆ లేడీ డాక్టర్ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. షాక్ అయిన ఆమె సహాయం కోసం కేకలు వేసింది. దీంతో అతడు బైక్పై పారిపోయాడు.
మరోవైపు ఆ వైద్యురాలు సోలదేవనహళ్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడ్ని గుర్తించి అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు. అయితే వరుస సంఘటనల నేపథ్యంలో బెంగళూరులో మహిళల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతున్నది.
Also Read:
Woman Gang Raped | హోటల్లో తప్పుడు రూమ్ తట్టిన మహిళ.. ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారం
Jitan Ram Manjhi | ‘ఆయన రిగ్గింగ్ ద్వారా ఎన్నికల్లో గెలిచారు’.. ఆర్జేడీ ఆరోపణలను ఖండించిన మాంఝీ
Watch: వీధిలో ఆడుతున్న బాలుడు.. ‘ఫుట్బాల్’ మాదిరిగా తన్నిన వ్యక్తి