పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగినట్లు ఆర్జేడీ ఆరోపించింది. కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీ (Jitan Ram Manjhi)కి సంబంధించిన ఒక వీడియో క్లిప్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే ఈ వీడియోను ట్యాంపర్ చేసినట్లు ఆయన ఆరోపించారు. బీహార్ మాజీ సీఎం అయిన జితన్ రామ్ మాంఝీ 2020 అసెంబ్లీ ఎన్నికల్లో గయాలోని తిక్రి స్థానం నుంచి పోటీ చేశారు. నాటి ఫలితాల ఆరంభంలో తాను 2,700 ఓట్లు వెనుకబడి ఉన్నట్లు మాంఝీ తెలిపారు. ప్రస్తుతం త్రిపురలో ఉన్న అప్పటి జిల్లా కలెక్టర్ అభిషేక్ సింగ్ సహాయంతో తాను గెలిచినట్లు ఒక వీడియోలో చెప్పారు. అయితే ఈసారి 1,600 ఓట్ల తేడాతో ఆ సీటును మాంఝీ కోల్పోయారు. ఈ నేపథ్యంలో ఆ అధికారి తనకు ఫోన్ చేసి ఏం జరిగింది అని అడిగారని ఆ వీడియోలో పేర్కొన్నారు.
కాగా, ఆర్జేడీ ఈ వీడియో క్లిప్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఎన్నికల్లో రిగ్గింగ్‌కు పాల్పడినట్లు జితన్ రామ్ మాంఝీ ఆ వీడియోలో అంగీకరించినట్లు తెలిపింది. ‘అవినీతిపరులైన ఎన్నికల కమిషనర్లు, ఎన్నికల కమిషన్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ప్రజాస్వామ్యం ఇలాగే ఉంటుందా? అవినీతి అధికారుల చీకటి పనుల సహాయంతో మీరు ఎంతకాలం నకిలీ ఎన్నికల్లో గెలుస్తారు?’ అని ఆర్జేడీ ప్రశ్నించింది.
మరోవైపు కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీ ఈ ఆరోపణలను ఖండించారు. తనకు అప్రతిష్ట కలిగించే ప్రయత్నమని విమర్శించారు. తన ప్రసంగం వీడియోను ట్యాంపర్ చేశారని ఆయన ఆరోపించారు. ‘ఆకాశం వైపు ఉమ్మివేసే వారు, ఆ ఉమ్మి మీ ముఖం మీదే పడుతుందని మీరు మరిచిపోతున్నారు. ఇప్పుడు మాంఝీ ఒక బ్రాండ్. ఇకపై ఎవరికీ భయపడరు’ అని ఎక్స్ పోస్ట్‌లో పేర్కొన్నారు.
ये भारत सरकार में कैबिनेट मंत्री, बिहार के पूर्व मुख्यमंत्री तथा हम पार्टी के संरक्षक श्री जीतन राम मांझी जी है जो ठगेश कुमार जैसे पिद्दी पालतू आयुक्त के मुँह पर करारा तमाचा जड़ डंके की चोट पर खुले मंच से चुनाव नतीजों में हेरा-फेरी, मशीनरी और धांधली से चुनाव जितने का शाही… pic.twitter.com/FSPyQgeBWB
— Rashtriya Janata Dal (@RJDforIndia) December 18, 2025
मेरे एक विडियो के साथ छेडछाड कर वायरल करने वाले कुछ लोगों को लगता है कि मुसहर के लाल को बदनाम कर देंगें।
ऐसे लोगों को मैं बता देना चाहता हूँ कि अब मुसहर के बेटे को कोई ना तो अपमानित कर सकता है ना ही बेवक़ूफ़ बना सकता है।
“आसमान पर थूकने वालों तुम यह भूल रहे हो कि आसमान पर फेंका…— Jitan Ram Manjhi (@jitanrmanjhi) December 18, 2025
Also Read:
Woman Gang Raped | హోటల్లో తప్పుడు రూమ్ తట్టిన మహిళ.. ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారం
Watch: పోలీస్ వ్యాన్ నుంచి తప్పించుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?