బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ భవన్కు చేరుకోవడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఉప్పొంగింది. ఆదివారం బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్న కేసీఆర్ను చూసేందుకు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పోటీపడ్డారు.కేసీఆర్ రాకతో తెలంగాణ భవన్ పరిసర ప్రాంతాలు కోలాహలంగా మారాయి. ఎటు చూసినా జనసందోహం కనిపించింది.





