Chinese Man | ‘ఆ తిండిబోతుకు పెట్టిన ఖర్చులు తిరిగి ఇప్పించండి’.. మాజీ ప్రియురాలిపై కోర్టులో యువకుడి దావా..!
Chinese Man | ఓ యువకుడు తన మాజీ ప్రియురాలిని కోర్టుకు ఈడ్చాడు. డేటింగ్ (Dating) లో తనతో కలిసి ఉన్నప్పుడు ఆమె తిండి కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేశానని, ఆ సొమ్మంతా తిరిగిప్పించాలని కోర్టులో దావా వేశాడు. విచారించిన కోర్టు.. రిలేషన్ షిప్లో ఉన్న సమయంలో పెట్టిన ఖర్చు, కొనిచ్చిన వస్తువులతో ఇరువురూ భావోద్వేగ బంధాన్ని కలిగి ఉంటారని, ఆ సొమ్మును తిరిగి ఇవ్వమనడం సరికాదని పేర్కొంది.
Chinese Man : ఓ యువకుడు తన మాజీ ప్రియురాలిని కోర్టుకు ఈడ్చాడు. డేటింగ్ (Dating) లో తనతో కలిసి ఉన్నప్పుడు ఆమె తిండి కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేశానని, ఆ సొమ్మంతా తిరిగిప్పించాలని కోర్టులో దావా వేశాడు. విచారించిన కోర్టు.. రిలేషన్ షిప్లో ఉన్న సమయంలో పెట్టిన ఖర్చు, కొనిచ్చిన వస్తువులతో ఇరువురూ భావోద్వేగ బంధాన్ని కలిగి ఉంటారని, ఆ సొమ్మును తిరిగి ఇవ్వమనడం సరికాదని పేర్కొంది. ఆ యువకుడి పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. అయితే బ్రైడ్ ప్రైజ్ (Bride prize) కింద యువకుడి తల్లిదండ్రులు ఇచ్చిన సొమ్ములో సగం తిరిగివ్వాలని అతడి మాజీ ప్రియురాలిని కోర్టు (Court) ఆదేశించింది.
వివరాల్లోకి వెళ్తే.. నార్త్ ఈస్టర్న్ చైనాలోగల హిలోంజియాంగ్ రాష్ట్రంలోని ఓ మారుమూల గ్రామానికి చెందిన యువకుడు హె కి, వాంగ్ అనే యువతితో మాట్రిమోని యాప్‌లో పరిచయం ఏర్పడింది. ఆపై ఇరువురూ కొంతకాలం రిలేషన్షిప్లో ఉన్నారు. ఆ సమయంలో హె తల్లిదండ్రులకు చెందిన హోటల్లో వాంగ్ పనిచేసింది. అప్పుడే హె, వాంగ్ ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఆ సమయంలో సంప్రదాయం ప్రకారం హె తల్లిదండ్రులు బ్రైడ్ ప్రైస్ కింద 20 వేల యువాన్లు వాంగ్‌కు ఇచ్చారు.
ఎంగేజ్మెంట్ తర్వాత ఆరు నెలలు కలిసి ఉన్నారు. ఆ తర్వాత వాంగ్ తీరుతో విసిగిపోయిన హె ఆమెతో పెళ్లిని రద్దు చేసుకున్నాడు. వాంగ్‌కు పనికన్నా తిండిపైనే ఎక్కువ శ్రద్ధ ఉండేదని, తరచూ షాపింగ్ చేస్తూ తన డబ్బుతో దుస్తులు ఇతరత్రా వ్యక్తిగత వస్తువులను కొనుగోలు చేసిందని ఆరోపించాడు. అందుకు 30 వేల యువాన్లు ఖర్చయిందని, బ్రైడ్ ప్రైస్‌గా ఇచ్చిన 20 వేల యువాన్లు కలిపి మొత్తం 50 వేల యువాన్లు (దాదాపు రూ.6.3 లక్షలు) తిరిగి ఇప్పించాలని కోర్టులో దావా వేశాడు.
అయితే ప్రియురాలి కోసం పెట్టిన ఖర్చు ఇద్దరి భావోద్వేగాలతో ముడిపడి ఉంటుందని, ఆ సొమ్మును తిరిగి ఇవ్వమనడం సరికాదని జడ్జి పేర్కొన్నారు. కేసును కొట్టిస్తూ.. బ్రైడ్ ప్రైజ్ కింద యువకుడి కుటుంబం ఇచ్చిన 20 వేల యువాన్లలో సగం సొమ్ము తిరిగి ఇవ్వాలని వాంగ్‌ను ఆదేశించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దక్షిణాది వారికే ఛాన్స్ ఇవ్వాలి
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

