Fresh snowfall : ఉత్తరాది (North India) చలికి వణికిపోతోంది. జమ్ముకశ్మీర్ (Jammu and Kashmir), హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh) లలో తాజా హిమపాతం మొదలైంది. ఎత్తయిన భూభాగాల్లో హిమపాతం పెరిగి లోయలోని పలు ప్రాంతాల కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఘనీభవన స్థానం కంటే దిగువకు పడిపోయాయి. జలవనరుల ఉపరితల భాగాల్లో పలుచని మంచు పొరలు కనిపిస్తున్నాయి.
అనేక ప్రాంతాల్లో సున్నా డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. గుల్మార్గ్లోని స్కై రిసార్ట్, సోనామార్గ్, దూద్‌పత్రి సహా దక్షిణ, ఉత్తరకశ్మీర్‌లోని ఎత్తయిన ప్రాంతాలలో భారీగా మంచు కురుస్తుండటంతో ఆ ప్రాంతాలు శ్వేతవర్ణంలోకి మారిపోయాయి. కశ్మీర్ అంతటా పరుచుకున్న మంచుదుప్పటి ఒకవైపు పర్యాటకులను ఆకర్షిస్తుండగా.. మరోవైపు రోడ్లపై భారీగా మంచు పేరుకుపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఇదిలావుంటే భారీవర్షం కారణంగా పలు చోట్ల కొండ చరియలు విరిగిపడటంతో జమ్ము-శ్రీనగర్ జాతీయ రహదారిపై రాకపోకలు నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. రహదారిపై అడ్డంకులను తొలగించి రాకపోకలను పునరుద్ధరించడానికి చర్యలు చేపట్టినట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో మంచు తీవ్రత ఎక్కువయ్యే అవకాశం ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. శీతాకాల సంసిద్ధతపై ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా నేతృత్వంలో శనివారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
భారీ హిమపాతాన్ని ఎదుర్కోవడానికి రోడ్ క్లియరెన్స్, నిరంతర విద్యుత్తు సరఫరా, తాగునీటి లభ్యత వంటి వాటిపై దృష్టి సారించినట్లు సీఎం ఒమర్ అబ్దుల్లా పేర్కొన్నారు.
Welcome to Chilla-e-Kalan ❄️
Fresh snowfall blankets Sonamarg in pristine white, marking the arrival of Kashmir’s harshest winter with breathtaking beauty.#ChillaEKalan #Sonamarg #FreshSnowfall #WinterInKashmir pic.twitter.com/qx2wSSI90V— Fayaz Ahmad Bhat (@chairmanjkpf) December 21, 2025