లక్నో: భరణం చెల్లించకుండా తప్పించుకునేందుకు భర్త అనారోగ్యం నాటకం ఆడుతున్నాడని భార్య ఆరోపించింది. ఈ నేపథ్యలంలో ఆ వ్యక్తిని స్ట్రెచర్‌పై కోర్టుకు కుటుంబం తరలించింది. పక్షవాతంతో మంచానికి పరిమితమైన అతడి పరిస్థితిని కోర్టుకు చూపించింది. (Man Brought To Court On Stretcher) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఈ సంఘటన జరిగింది. ఒక జంట వివాహం నెలలోనే విచ్ఛిన్నమైంది. దీంతో భార్య తన పుట్టింటికి వెళ్లింది. భరణం కోరుతూ కాన్పూర్ ఫ్యామిలీ కోర్టును ఆమె ఆశ్రయించింది.
కాగా, ఐదేళ్ల కిందట ఆ వ్యక్తికి పక్షపాతం వచ్చింది. దీంతో మాట్లాడలేని, నడవలేని స్థితిలో ఉన్న అతడు పూర్తిగా మంచానికి పరిమితమయ్యాడు. సంరక్షణ కోసం పూర్తిగా తన కుటుంబంపై ఆధారపడ్డాడు. అయితే తన భర్త ఆరోగ్యంగా ఉన్నాడని, పని చేయగలడని భార్య కోర్టుకు తెలిపింది. భరణం చెల్లించకుండా ఉండేందుకు ఉద్దేశపూర్వకంగా అనారోగ్యంతో ఉన్నట్లు నటిస్తున్నాడని కోర్టులో ఆరోపించింది.
మరోవైపు భార్య ఆరోపణలపై భర్త కుటుంబం కలత చెందింది. హాస్పిటల్లో ఉన్న అతడ్ని అంబులెన్స్‌లో కోర్టుకు తరలించారు. స్ట్రెచర్‌పై కోర్టు హాలులో హాజరుపరిచారు. ఆ వ్యక్తి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని నిర్ధారించే వైద్య నివేదికలు, సర్టిఫికెట్లు, ఇతర ఫొటోలను కోర్టుకు సమర్పించారు. న్యాయమూర్తి, న్యాయవాదులు, కోర్టులో ఉన్న వారిని ఇది దిగ్భ్రాంతికి గురిచేసింది.
కాగా, భార్య ఆరోపణలపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. నిర్ధారణ కోసం ఆ వ్యక్తికి వైద్యపరీక్షలకు ఆదేశించింది. అయితే పక్షవాతంతో మంచానికి పరిమితమైన భర్తను చూసేందుకు భార్య ఒక్కసారి కూడా ఇంటికి రాలేదని అతడి కుటుంబం ఆరోపించింది. అతడి ఆరోగ్యం కోసం గత ఐదేళ్లుగా చాలా ఖర్చు చేసినట్లు సోదరి వాపోయింది. ఆ వ్యక్తిని స్ట్రెచర్‌పై కోర్టుకు తరలించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
In a shocking case in Kanpur, a paralyzed husband was brought to court on a stretcher to prove his physical condition in a maintenance dispute. The wife claimed that the husband was faking illness, even though he had been paralyzed due to brain hemorrhage.
The woman told the… pic.twitter.com/zC8TbuqMqi
— ForMenIndia (@ForMenIndia_) December 20, 2025
Also Read:
Railways Hikes Fares | ఛార్జీలు పెంచిన రైల్వే.. డిసెంబర్ 26 నుంచి అమలు
Watch: ట్రాఫిక్ పోలీస్ ఐడీని పొరపాటున పడేసిన మహిళ.. దారుణంగా కొట్టిన పోలీస్ అధికారి
Watch: దోమలు కుట్టాయని.. ఒక వ్యక్తి ఏం చేశాడంటే?