న్యూఢిల్లీ: రైలు టికెట్ ఛార్జీలను రైల్వే పెంచింది. (Railways Hikes Fares) ప్రతి 500 కిలోమీటర్ల దూరం ప్రయాణానికి నాన్ ఏసీ టికెట్లపై రూ.10 అదనపు భారం పడనున్నది. పెరిగిన రైల్వే ఛార్జీలు డిసెంబర్ 26 నుంచి అమలులోకి వస్తాయి. సబర్బన్ రైలు ప్రయాణ ఛార్జీలను రైల్వే పెంచలేదు. అయితే ఎక్కువ దూరం ప్రయాణాలకు సంబంధించిన ఛార్జీలు పెరిగాయి.
కాగా, 215 కిలోమీటర్ల దూరం వరకు జనరల్ క్లాస్ రైలు టికెట్ల రేట్లలో ఎలాంటి మార్పు లేదు.
215 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరాలకు కిలోమీటరుకు ఒక పైసాను రైల్వే పెంచింది. అలాగే మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ఎయిర్ కండిషన్డ్ లేని (నాన్ ఏసీ) కోచ్‌ల్లో ప్రయాణాలకు కిలోమీటరుకు 2 పైసలు పెంచింది. ఎయిర్ కండిషన్డ్ (ఏసీ) కోచ్‌లలో ప్రయాణ ఖర్చు కూడా కిలోమీటరుకు 2 పైసలు పెరిగింది. దీంతో నాన్ ఏసీ, ఏసీ కోచ్‌ల్లో ప్రయాణాలకు ప్రతి 500 కిలోమీటర్ల దూరానికి రూ.10 అదనంగా ఖర్చు పెరుగుతుంది.
మరోవైపు పెరిగిన కొత్త ఛార్జీలు డిసెంబర్ 26 నుంచి అమలులోకి వస్తాయని రైల్వే తెలిపింది.
ఛార్జీల పెంపు వల్ల రైల్వే ఆదాయం ఏటా రూ. 600 కోట్లు పెరుగుతుందని పేర్కొంది. రైల్వే ఉద్యోగుల వేతనాల ఖర్చు రూ.1,15,000 కోట్లకు, పెన్షన్ ఖర్చు రూ.60,000 కోట్లకు పెరిగిందని రైల్వే తెలిపింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రైల్వే కార్యకలాపాల మొత్తం ఖర్చు రూ.2,63,000 కోట్లకు పెరిగినట్లు వివరించింది. ఈ నేపథ్యంలో కార్గో, ప్రయాణీకుల ఛార్జీల పెంపుపై దృష్టి సారించినట్లు రైల్వే వెల్లడించింది.
Also Read:
differently-abled Boy Thrashed | దివ్యాంగ బాలుడ్ని కొట్టి.. కంట్లో కారం చల్లిన స్కూల్ నిర్వాహకులు
Watch: ట్రాఫిక్ పోలీస్ ఐడీని పొరపాటున పడేసిన మహిళ.. దారుణంగా కొట్టిన పోలీస్ అధికారి
Watch: లైవ్ టీవీ చర్చలో ఘర్షణ.. కొట్టుకున్న రామ్‌దేవ్ బాబా, ప్యానలిస్ట్