చెన్నై: జాతీయ రహదారిపై పలు వాహనాలు ఢీకొన్నాయి. (Multi Vehicle Collision) ఏడేళ్ల బాలుడితో సహా ముగ్గురు మరణించారు. మరో ఏడుగురు గాయపడ్డారు. వాహనాల్లో చిక్కుకున్న వారిని రెస్క్యూ సిబ్బంది కాపాడారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. వాహనాలు రద్దీగా ఉండే బెంగళూరు-సేలం హైవేపై ఆదివారం ఘోర ప్రమాదం జరిగింది. తొలుత ఒక లారీ ప్రమాదానికి గురైంది. దాని వెనుక ఉన్న రెండు కార్లు, బైక్‌ను మరో లారీ ఢీకొట్టింది. దీంతో ఆ కార్లు, బైక్ నుజ్జునుజ్జు అయ్యాయి.
కాగా, ప్రమాదానికి గురైన కార్లలో ఉన్న ఏడేళ్ల బాలుడితోసహా ముగ్గురు మరణించారు. మరో ఏడుగురు గాయపడ్డారు. పోలీసులు, రెస్క్యూ సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకున్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో రెండు లారీలు, రెండు కార్లు, బైక్ ధ్వంసమైనట్లు పోలీస్ అధికారి తెలిపారు. వాహనాలు నిలిచిపోయాయని, దీంతో కొంత శ్రమించి ట్రాఫిక్‌ను క్లియర్ చేసినట్లు వెల్లడించారు.
Also Read:
Man Stabs Wife In Hospital | భార్యను కొట్టడంతో ఆసుపత్రిపాలు.. అక్కడికెళ్లి కత్తితో పొడిచి చంపిన భర్త
Pilot Rape Air Hostess | ఎయిర్ హోస్టెస్‌పై పైలట్ అత్యాచారం.. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు
Watch: భారీ వర్షాలు, వరదలకు రోడ్డుపైకి కొట్టుకొచ్చిన చేపలు.. తర్వాత ఏం జరిగిందంటే?