కోల్కతా: ఒక గోడౌన్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అందులో పని చేసే ముగ్గురు కార్మికులు సజీవ దహనమయ్యారు. మరికొందరు కనిపించడం లేదు. దీంతో వారి కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. (Kolkata Warehouse Fire) పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో ఈ సంఘటన జరిగింది. సోమవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఆనందపూర్లోని నజీరాబాద్ ప్రాంతంలో డ్రై ఫుడ్స్ గిడ్డంగిలో భారీ స్థాయిలో మంటలు చెలరేగాయి.
కాగా, ఈ సమాచారం తెలిసిన వెంటనే ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. ఇరుకైన వీధిలో ఆ గోడౌన్ ఉండటంతో లోపలకు వెళ్లలేకపోయారు. 15 అగ్నిమాపక యంత్రాలతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. ఉదయం 11 గంటలకు పాక్షికంగా మంటలను అదుపు చేశారు.
మరోవైపు ప్యాక్ చేసిన ఆహార పదార్థాలు, కూల్ డ్రింక్స్ బాటిల్స్ ఈ గోడౌన్లో నిల్వ చేయడంతో మంటలు ఎగసిపడ్డాయి. పక్కనే ఉన్న మరో రెండు గిడ్డంగులకు వ్యాపించాయి. ఈ అగ్ని ప్రమాదంలో ఇప్పటి వరకు ముగ్గురు కార్మికులు మరణించినట్లు అధికారులు తెలిపారు. మరో ఆరుగురు వ్యక్తుల ఆచూకీ తెలియడం లేదని చెప్పారు. దీంతో వారి కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి.
#WATCH | West Bengal | Fire broke out in a manufacturing unit in Anandapur, Kolkata. Efforts to douse the fire are underway. pic.twitter.com/YhAhHfPlT4
— ANI (@ANI) January 26, 2026
Also Read:
Man Set Ablaze | వరండాలో కూర్చునే స్థలంపై వివాదం.. వ్యక్తికి నిప్పంటించడంతో మృతి
ambulance doors jammed, Patient dies | అంబులెన్స్ డోర్స్ జామ్.. రోగి మృతి
Girl Killed By Instagram Friend | బాలికను హత్య చేసిన.. ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్
Watch: రిపబ్లిక్ డే పరేడ్లో.. ఎయిర్ఫోర్స్ ‘సిందూర్ ఫార్మేషన్’