లక్నో: ఒక బాలికకు ఇన్‌స్టాగ్రామ్‌లో వ్యక్తి పరిచయమయ్యాడు. పెళ్లి చేసుకుంటానని అతడు నమ్మించాడు. ప్రలోభపెట్టి తన వద్దకు రప్పించుకున్నాడు. స్నేహితులతో కలిసి ఆ బాలికను హత్య చేశాడు. రైలు పట్టాల వద్ద ఆమె మృతదేహాన్ని పడేశారు. (Girl Killed By Instagram Friend) ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఈ సంఘటన జరిగింది. అన్షు గౌతమ్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో మైనర్ బాలిక పరిచయమైంది. ఫోన్లో సోషల్ మీడియాలో ఆమెతో మాట్లాడేవాడు. పెళ్లి చేసుకుంటానని ఆ బాలికను నమ్మించాడు. ఆమెను ప్రలోభపెట్టి తన వద్దకు రప్పించుకున్నాడు.
కాగా, ఆ బాలిక కనిపించకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. బాలిక తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఒక పోలీస్ బృందాన్ని ఏర్పాటు చేశారు. ఐదు రోజుల కిందట రైలు పట్టాల వద్ద బాలిక మృతదేహాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
మరోవైపు మైనర్ బాలికను హత్య చేసిన అన్షు గౌతమ్, అతడి స్నేహితులైన ఆషిక్, వైభవ్, రిషబ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. బాలికతో వివాదం నేపథ్యంలో స్నేహితులతో కలిసి గొంతునొక్కి హత్య చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. పోక్సో చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Also Read:
Op Sindoor tableau | రిపబ్లిక్ డే పరేడ్‌లో.. హైలైట్‌గా ‘ఆపరేషన్ సిందూర్’ శకటం
Vande Mataram | ‘వందే మాతరం’ థీమ్‌తో రిపబ్లిక్ డే పరేడ్.. ఆకట్టుకున్న కళాకృతులు
Watch: రిపబ్లిక్ డే పరేడ్‌లో.. ఎయిర్‌ఫోర్స్ ‘సిందూర్ ఫార్మేషన్’