న్యూఢిల్లీ: భారత 77వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ‘వందేమాతరానికి 150 ఏళ్లు’ ప్రధాన ఇతివృత్తంతో ఈ వేడుకలను నిర్వహించారు. ఈ నేపథ్యంలో ‘వందేమాతరం’ కళాకృతులతో కూడిన శకటం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. (Vande Mataram) కళాకారుడు తేజేంద్ర కుమార్ మిత్రా ‘వందేమాతరం’ ప్రారంభ పద్యాలను లిఖించారు.
కాగా, ఈ ఏడాది రిపబ్లిక్ డే పరేడ్ ‘వందేమాతరం’ శతజయంతి ఉత్సవ ప్రధాన ఇతివృత్తంగా కొనసాగింది. రిపబ్లిక్ డే పరేడ్ ఆహ్వాన పత్రికలపై కూడా ‘వందేమాతరం’ శతజయంత్యుత్సవ లోగోతో పాటుతో ఆ గీతం ఉన్నది. బంకిం చంద్ర ఛటర్జీ సిల్హౌట్ చిత్రం, ‘వందేమాతరం’ వాటర్మార్క్గా ఉన్నాయి.
మరోవైపు 1875లో బంకిం చంద్ర ఛటర్జీ రచించిన ‘వందేమాతరం’ గీతం స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో ఒక నినాదంగా మారింది. 1950లో రాజ్యాంగ పరిషత్ భారత జాతీయ గీతంగా దీనిని స్వీకరించింది.
Also Read:
Republic Day 2026 | ఢిల్లీలో రిపబ్లిక్ డే.. జెండా ఎగురవేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
Op Sindoor tableau | రిపబ్లిక్ డే పరేడ్లో.. హైలైట్గా ‘ఆపరేషన్ సిందూర్’ శకటం
Watch: రిపబ్లిక్ డే పరేడ్లో.. ఎయిర్ఫోర్స్ ‘సిందూర్ ఫార్మేషన్’