Republic Day 2026 | దేశ రాజధాని ఢిల్లీలో ఘనంగా 77వ గణతంత్ర వేడుకలు అట్టహాసంగా కొనసాగుతున్నాయి.”వందేమాతరానికి 150 ఏళ్లు” ప్రధాన ఇతివృత్తంతో వేడుకలు నిర్వహిస్తున్నారు. ఉదయం 10.30 గంటలకు కర్తవ్యపథ్‌లో వేడుకలు ప్రారంభం కాగా.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం భద్రతాబలగాల గౌరవవందనం స్వీకరించారు.
జెండా ఆవిష్కరణ అనంతరం పరేడ్ ప్రారంభమైంది. 6050 మంది సైనికులతో ఈ పరేడ్ నిర్వహించారు. ఇందులో 17 రాష్ట్రాలు, 13 కేంద్ర ప్రభుత్వ శకటాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా భారతీయ వ్యోమగామి శుభాన్ష్ శుక్లాకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అశోక చక్ర ప్రదానం చేశారు.
గణతంత్ర వేడుకలకు ఐరోపా మండలి అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా, ఐరోపా కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్‌డెర్ లేయెన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రిపబ్లిక్ డే వేడుకలకు ప్రధాని మోదీ, ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, కేంద్రమంత్రులు పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఐదంచెల భద్రతను ఏర్పాటు చేశారు. 30 వేల మంది పోలీసులు, కేంద్ర బలగాలతో భద్రత కల్పించారు. కర్తవ్యపథ్ సమీపంలో 6 కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు.
Delhi: The 77th Republic Day parade begins with President Droupadi Murmu taking the salute.
The parade is commanded by Parade Commander Lieutenant General Bhavnish Kumar, General Officer Commanding, Delhi Area, a second-generation officer. Major General Navraj Dhillon, Chief of… pic.twitter.com/mZ73UhEw6v
— IANS (@ians_india) January 26, 2026
President Droupadi Murmu, along with President of the European Council, António Luís Santos da Costa and President of the European Commission, Ursula Von Der Leyen, arrives at the saluting dais at Kartavya Path in Delhi to witness the parade. pic.twitter.com/hw1eI2y4lP
— Organiser Weekly (@eOrganiser) January 26, 2026