న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్‌లో భారత వైమానిక దళం తన సత్తా చాటింది. ఈ నేపథ్యంలో రిపబ్లిక్ డే పరేడ్ సందర్భంగా మరోసారి తన శక్తి, సామర్థ్యాలను ప్రదర్శించింది. రఫేల్, మిగ్-29, ఎస్‌యూ-30 యుద్ధ విమానాలు ‘ఆపరేషన్ సిందూర్’ ఫార్మేషన్తో ఆకట్టుకున్నాయి. (Air Force’s Sindoor Formation) వైమానిక విన్యాసాల్లో 16 యుద్ధ విమానాలు, నాలుగు రవాణా విమానాలు, తొమ్మిది హెలికాప్టర్లు పాల్గొన్నాయి. వీటిలో రఫేల్, ఎస్‌యూ-30 ఎంకేఐ, మిగ్-29, జాగ్వార్ విమానాలు ప్రత్యేక విన్యాసాలు నిర్వహించాయి. వ్యూహాత్మక సీ-130, సి-295, భారత నావికాదళానికి చెందిన పీ-8ఐ యుద్ధ విమానాలు కూడా తమ శక్తి, సామర్థ్యాలను ప్రదర్శించాయి.
కాగా, రిపబ్లిక్ డే ఎయిర్ షోలో అర్జున్, వజ్రాంగ్, వరుణ్, విజయ్ ఫార్మేషన్లతో యుద్ధ విమానాలు ఆకట్టుకున్నాయి. రెండు రఫేల్ జెట్లు, రెండు మిగ్-29లు, రెండు ఎస్‌యూ-30లు, ఒక జాగ్వార్ విమానంతో కూడిన ‘స్పియర్‌హెడ్’ ఫార్మేషన్ ప్రత్యేకత చాటుకున్నది. ఆపరేషన్ సిందూర్ ఫార్మేషన్కు ఇది ప్రతీకగా నిలిచింది. విక్, త్రిశూల్, వెర్టికల్ చార్లీ వంటి విన్యాసాలను కూడా చేశాయి. ధ్రువ్ అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ ‘ఆపరేషన్ సిందూర్’ జెండాను ప్రత్యేకంగా ప్రదర్శించింది.
మరోవైపు వైమానిక దళ బృందం కవాతు కూడా ఎంతో ఆకట్టుకున్నది. నలుగురు అధికారులు, 144 మంది వైమానికులు పాల్గొన్నారు. స్క్వాడ్రన్ లీడర్ జగదీష్ కుమార్ ఈ బృందానికి కమాండర్‌గా వ్యవహరించారు. స్క్వాడ్రన్ లీడర్ నికితా చౌదరి, ఫ్లైట్ లెఫ్టినెంట్ ప్రఖర్ చంద్రకర్, ఫ్లైట్ లెఫ్టినెంట్ దినేష్ కూడా పరేడ్‌లో పాల్గొన్నారు.
Sindoor formation by IAF fighter jets in Republic day 🔥pic.twitter.com/TT34NG1UQE
— Frontalforce 🇮🇳 (@FrontalForce) January 26, 2026
Formation (4/8) pic.twitter.com/hqtM7fZLD0
— Indian Air Force (@IAF_MCC) January 26, 2026
Formation (2/8) pic.twitter.com/EbajUurNg9
— Indian Air Force (@IAF_MCC) January 26, 2026
Also Read:
Op Sindoor tableau | రిపబ్లిక్ డే పరేడ్‌లో.. హైలైట్‌గా ‘ఆపరేషన్ సిందూర్’ శకటం
Republic Day 2026 | ఢిల్లీలో రిపబ్లిక్ డే.. జెండా ఎగురవేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
Watch: వరుడికి రసగుల్లా తినిపించేందుకు తల్లి యత్నం.. వధువు ఏం చేసిందంటే?