అహ్మదాబాద్: కూర్చునే స్థలం విషయంలో వివాదం జరిగింది. ఈ నేపథ్యంలో ఒక వ్యక్తికి నిప్పంటించారు. తీవ్రంగా కాలిన గాయాలైన అతడు మరణించాడు. ఇద్దరు మహిళలతో సహా ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. (Man Set Ablaze) గుజరాత్‌లోని కచ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఆదివారం గాంధీధామ్ నగరంలోని ప్రాంతంలో ఇంటి వరండాలోని అరుగుపై కొందరు వ్యక్తులు కూర్చొన్నారు.
కాగా, కూర్చునే స్థలం విషయంలో వివాదం చెలరేగింది. చిన్నపాటి వాగ్వాదం తీవ్ర ఘర్షణకు దారి తీసింది. దీంతో 50 ఏళ్ల కర్సన్ మహేశ్వరిపై నలుగురు వ్యక్తులు దాడి చేశారు. పారిపోతున్న కర్సన్ను వెంబడించారు. బాత్ రూమ్‌లో దూరిన అతడిపై మండే ద్రవం పోసి నిప్పంటించారు. తీవ్ర కాలిన గాయాలైన కర్సన్ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు.
మరోవైపు కర్సన్ కుటుంబం ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులైన 30 ఏళ్ల ప్రేమిలాబెన్, 36 ఏళ్ల అంజుబెన్, 47 ఏళ్ల చిమనా రామ్‌ను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో నిందితురాలు మంజుబెన్ కోసం వెతుకుతున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. అయితే ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.
Also Read:
ambulance doors jammed, Patient dies | అంబులెన్స్ డోర్స్ జామ్.. రోగి మృతి
Girl Killed By Instagram Friend | బాలికను హత్య చేసిన.. ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్
Watch: రిపబ్లిక్ డే పరేడ్‌లో.. ఎయిర్‌ఫోర్స్ ‘సిందూర్ ఫార్మేషన్’