భోపాల్: ఒక రోగిని అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. అయితే అంబులెన్స్ డోర్స్ జామ్ అయ్యాయి. దీంతో కొందరు వ్యక్తులు చాలా సేపు శ్రమించిన తర్వాత డోర్స్ తెరుచుకున్నాయి. అందులో ఉన్న రోగి మరణించాడు. (ambulance doors jammed, Patient dies) మధ్యప్రదేశ్‌లోని సత్నా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. రామ్‌నగర్ ప్రాంతానికి చెందిన 67 ఏళ్ల రామ్ ప్రసాద్ శనివారం ఉదయం ఇంట్లో చలి కాగుతూ కుప్పకూలిపోయాడు. కుటుంబ సభ్యులు అతడ్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు.
కాగా, రామ్ ప్రసాద్‌కు ప్రాథమిక చికిత్స అందించారు. అతడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో సత్నాలోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి రిఫర్ చేశారు. దీంతో ప్రభుత్వ అంబులెన్స్‌లో అక్కడకు తరలించారు. ఆ హాస్పిటల్‌కు అంబులెన్స్ చేరుకున్న తర్వాత వెనుక డోర్లు జామ్ అయ్యాయి.
మరోవైపు డ్రైవర్‌తో పాటు మరికొందరు బలవంతంగా అంబులెన్స్ డోర్లు తెరిచేందుకు ప్రయత్నించారు. ఒక వ్యక్తి విండో నుంచి లోపలకు వెళ్లి డోర్లను కాలితో తన్నాడు. కొంత సేపటి తర్వాత అంబులెన్స్ డోర్లు తెరుచుకున్నాయి. రామ్ ప్రసాద్‌ను స్ట్రెచర్‌పై బయటకు తీశారు.
అయితే డాక్టర్ వద్దకు తీసుకెళ్లగా అప్పటికే ఆ రోగి మరణించినట్లు తెలిపారు. దీంతో ప్రభుత్వ అంబులెన్స్‌ల నిర్వహణపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ సంఘటనపై దర్యాప్తు చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని సత్నా చీఫ్ మెడికల్ ఆఫీసర్ తెలిపారు. కాగా, అంబులెన్స్ డోర్స్ జామ్ వీడియో క్లిప్ వైరల్ అయ్యింది.
Jeevandayini Turns Deadly: 108 Ambulance Door Jam Costs Heart Patient His Life in Satna pic.twitter.com/ETU3bepSD9
— The Times Patriot (@thetimespatriot) January 26, 2026
Also Read:
Girl Killed By Instagram Friend | బాలికను హత్య చేసిన.. ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్
Op Sindoor tableau | రిపబ్లిక్ డే పరేడ్‌లో.. హైలైట్‌గా ‘ఆపరేషన్ సిందూర్’ శకటం
Watch: రిపబ్లిక్ డే పరేడ్‌లో.. ఎయిర్‌ఫోర్స్ ‘సిందూర్ ఫార్మేషన్’