అబుదాబి: పాకిస్థాన్‌కు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) షాక్ ఇచ్చింది. ఆ దేశ అధ్యక్షుడి భారత పర్యటన తర్వాత కీలక నిర్ణయం తీసుకున్నది. ఇస్లామాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్వహించే ప్రతిపాదనను యూఏఈ విరమించుకున్నది. (UAE abandons Pakistan deal) 2025 ఆగస్ట్ నుంచి చర్చలు జరుగుతున్న ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకున్నది. యూఏఈ తీసుకున్న ఈ కీలక నిర్ణయాన్ని పాకిస్థాన్ దినపత్రిక ‘ది ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్’ ధృవీకరించింది. ఎయిర్పోర్ట్ కార్యకలాపాల అవుట్సోర్స్ భాగస్వామిని గుర్తించకపోవడంతో నిర్వహణ ప్రణాళికను యూఏఈ రద్దు చేసినట్లు పేర్కొంది.
కాగా, మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో యూఏఈ అధ్యక్షుడు అల్ నహ్యాన్ జనవరి 19న భారత్‌లో ఆకస్మికంగా పర్యటించారు. ప్రధాని మోదీ ప్రత్యేక ఆహ్వానం మేరకు రెండు గంటల పర్యటనకు కుటుంబ సమేతంగా విచ్చేశారు. భారత్‌తో పలు కీలక ఒప్పందాలు చేసుకున్నారు.
మరోవైపు యూఏఈ అధ్యక్షుడిగా అల్ నహ్యాన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత భారత్‌లో పర్యటించడం ఇది మూడోసారి. గత పదేళ్లలో ఐదో పర్యటన కావడం విశేషం. యూఏఈ అధ్యక్షుడి ఆకస్మిక భారత పర్యటన తర్వాత కీలకమైన పాకిస్థాన్ విమానాశ్రయ ఒప్పందాన్ని ఆ దేశం రద్దు చేయడం విశేషం.
Also Read:
Op Sindoor tableau | రిపబ్లిక్ డే పరేడ్‌లో.. హైలైట్‌గా ‘ఆపరేషన్ సిందూర్’ శకటం
Vande Mataram | ‘వందే మాతరం’ థీమ్‌తో రిపబ్లిక్ డే పరేడ్.. ఆకట్టుకున్న కళాకృతులు
Watch: రిపబ్లిక్ డే పరేడ్‌లో.. ఎయిర్‌ఫోర్స్ ‘సిందూర్ ఫార్మేషన్’