Modi 3.0 Cabinet | కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన విషయం తెలిసిందే. 71 మంది ఎంపీలకు మంత్రులుగా అవకాశం లభించింది. అయితే, మోదీ 3.0 కేబినెట్ (Modi 3.0 Cabinet)లోని 71 మంది మంత్రుల్లో 28 మందిపై క్రిమినల్ కేసులు (Criminal Cases) ఉన్నట్లు తాజాగా వెల్లడైంది.
తెలంగాణ నుంచి కేంద్ర కేబినెట్లో చోటు దక్కించుకున్న బీజేపీ ఎంపీ బండి సంజయ్ సహా మొత్తం 28 మంది మంత్రులపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (Association of Democratic Reforms) తెలిపింది. ఆయా ఎంపీలు తమ ఎన్నికల నామినేషన్ సందర్భంగా దాఖలు చేసిన అఫిడవిట్లను అధ్యయనం చేసి ఈ విషయాన్ని వెల్లడించింది. 28 మందిలో 19 మందిపై హత్యాయత్నం, విద్వేష ప్రసంగం, మహిళలపై నేరాలు వంటి తీవ్రమైన నేరాలు ఉన్నట్లు తెలిపింది.
ముఖ్యంగా పోర్టులు, షిప్పింగ్, వాటర్ వేస్ శాఖల సహాయ మంత్రి శంతనూ ఠాకూర్, విద్య, ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ సహాయ మంత్రి సుఖాంత మజుందార్‌పై హత్యాయత్నం కేసులు ఉన్నట్లు పేర్కొంది. అదేవిధంగా శంతనూ ఠాకూర్, మజుందార్, బండి సంజయ్, సురేష్ గోపీ సహా ఐదుగురు సహాయ మంత్రులపై మహిళలపై నేరాలకు పాల్పడిన కేసులు నమోదైనట్లు అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ నివేదించింది.
Also Read..
Bomb Threat | ఢిల్లీలోని 15 మ్యూజియంలకు బాంబు బెదిరింపులు
Nirmala Sitharaman | వరుసగా రెండోసారి కేంద్ర ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిర్మలా సీతారామన్
Parliament Session | 24 నుంచి లోక్‌సభ.. 27 నుంచి రాజ్యసభ సమావేశాలు : కిరెణ్ రిజుజు