Woman Dies | మధ్యప్రదేశ్‌లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. 23 ఏళ్ల యువతి స్టేజ్‌పై డ్యాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు కోల్పోయింది (Woman Dies). ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
ఇండోర్ (Indore)కు చెందిన పరిణితి జైన్ బంధువుల వివాహ కార్యక్రమం (Cousins Wedding) కోసం విదిష (Vidisha)కు వెళ్లింది. వివాహ వేడుకలో భాగంగా శనివారం రాత్రి నిర్వహించిన హల్దీ ఫంక్షన్లో వేదికపై డ్యాన్స్ చేసింది. హిందీ పాటకు ఎంతో ఉత్సాహంగా స్టెప్పులేసి అతిథులను ఉత్సాహపరిచింది. డ్యాన్స్ చేస్తున్న సమయంలో ఆమె స్టేజ్‌పై ఒక్కసారిగా కుప్పకూలి కిందకు పడిపోయింది. వెంటనే స్పందించిన బంధువులు పరిణితికి సీపీఆర్ చేశారు.
అయినా ఆమె నుంచి ఎలాంటి స్పందనా లేకపోవడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరిణితిని పరీక్షించిన వైద్యులు ఆమె అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించారు. గుండెపోటు (Heart Attack)తోనే మరణించినట్లు తెలిపారు. కాగా, గతంలో ఆమె తమ్ముడు కూడా ఇలానే గుండెపోటుతో ఆకస్మికంగా ప్రాణాలు కోల్పోయినట్లు తెలిసింది. ఇద్దరు పిల్లలూ ఇలా అర్ధంతంగా మరణించడంతో తల్లిదండ్రులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు.
परिणीता अपनी बहन की शादी में आई थी,स्टेज पर खुशी में नाच रहीं थीं … अमूमन ऐसे कार्यक्रम में डीजे का भयानक शोर होता है …अचानक, लड़खड़ाती हैं और जमीन पर गिर जाती हैं,वहां मौजूद लोग कुछ समझ पाते,उससे पहले ही उनकी सांसें थम चुकी थीं। ये सब भयावह है… pic.twitter.com/9m2OmppeGf
— Anurag Dwary (@Anurag_Dwary) February 9, 2025
Also Read..
Pariksha Pe Charcha | పరీక్షలే సర్వస్వం కాదు.. విద్యార్థులతో ప్రధాని మోదీ
Aero India 2025 | ఏరో ఇండియా-2025 ప్రారంభం.. ఆకట్టుకుంటున్న యుద్ధ విమానాల ప్రదర్శన.. VIDEOS