Pariksha Pe Charcha | విద్యార్థు (Students)ల్లో పరీక్షల భయాన్ని పోగొట్టేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఏటా ప్రత్యేకంగా ‘పరీక్షా పే చర్చ’ (Pariksha Pe Charcha) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది కూడా 8వ ఎడిషన్ పరీక్షా పే (Pariksha Pe Charcha 2025) చర్చ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఢిల్లీలోని సుందరవనంలో జరిగిన ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులతో ప్రధాని ముచ్చటించారు.
ఏటా ఈ కార్యక్రమాన్ని న్యూఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహిస్తుంటారు. అయితే ఈ సారి 36 మంది విద్యార్థులను సుందర్ నర్సరీకి (Sunder Nursery) తీసుకెళ్లి ముచ్చటించారు. పరీక్షల్లో ఒత్తిడి సహా అనేక సమస్యలపై వారితో సంభాషించారు. ఒత్తిడికి లోనుకాకుండా చదువుపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. పరీక్షలే సర్వస్వం అనే భావనతో జీవించకూడదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తన పాఠశాల జీవితంలోని క్షణాలను విద్యార్థులతో పంచుకున్నారు ప్రధాని మోదీ. ఈ సందర్భంగా విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు కూడా మోదీ సమాధానాలిచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోని ప్రధాని ఎక్స్ వేదికగా షేర్ చేశారు.
Had a wonderful interaction with young students on different aspects of stress-free exams. Do watch Pariksha Pe Charcha. #PPC2025. https://t.co/WE6Y0GCmm7
— Narendra Modi (@narendramodi) February 10, 2025
Also Read..
Droupadi Murmu | త్రివేణీ సంగమంలో రాష్ట్రపతి ముర్ము పుణ్యస్నానం.. గంగమ్మకు ప్రత్యేక పూజలు
Aero India 2025 | ఏరో ఇండియా-2025 ప్రారంభం.. ఆకట్టుకుంటున్న యుద్ధ విమానాల ప్రదర్శన.. VIDEOS