Maha Kumbh | ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ (Prayagraj)లో జరుగుతున్న మహా కుంభమేళాకు (Maha Kumbh Mela) భక్తులు (devotees) పోటెత్తుతున్నారు. గంగ, యమున, సరస్వతి నదులు కలిసే పవిత్ర త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు ప్రపంచం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. లక్షలాది మంది భక్తులు ఇప్పటికే ప్రయాగ్‌రాజ్ చేరుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లే దారులన్నీ రద్దీగా మారాయి. లక్షల సంఖ్యలో భక్తులు కుంభమేళా వైపు వెళ్తుండటంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. దీంతో భక్తులు కుంభమేళా ప్రాంతానికి చేరుకోలేక తీవ్ర అవస్థలు పడుతున్నారు.
प्रयागराज महाकुंभ में फँसे करोड़ों श्रद्धालुओं के लिए तुरंत आपातकालीन व्यवस्था की जाए। हर तरफ़ से जाम में भूखे, प्यासे, बेहाल और थके तीर्थयात्रियों को मानवीय दृष्टि से देखा जाए। आम श्रद्धालु क्या इंसान नहीं है?
प्रयागराज में प्रवेश के लिए लखनऊ की तरफ़ 30 किमी पहले से ही नवाबगंज… pic.twitter.com/1JXmzgDEGI
— Akhilesh Yadav (@yadavakhilesh) February 9, 2025
కాగా, అధిక రద్దీ కారణంగా ప్రయాగ్‌రాజ్ సంగం రైల్వే స్టేషన్‌ను శుక్రవారం వరకు అధికారులు మూసివేశారు. దీంతో భక్తులు రోడ్డు మార్గాన్ని అనుసరిస్తున్నారు. ఈ క్రమంలో ఒకేసారి అధిక సంఖ్యలో వాహనాలు రోడ్డుపైకి రావడంతో ట్రాఫిక్ సమస్య (traffic jam) తలెత్తింది. వాహనాలు ముందుకు కదలని పరిస్థితి. ఆదివారం నుంచి సంగమం రోడ్డులో వందలాది వాహనాలు నిలబడిపోయాయి. చాలా నెమ్మదిగా ముందుకు కదులుతున్నాయి. దీంతో యాత్రికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ట్రాఫిక్ సమస్య కారణంగా గంటల తరబడి రోడ్డుపైనే నిలబడిపోతున్నారు.
महाकुंभ के अवसर पर उप्र में वाहनों को टोल मुक्त किया जाना चाहिए, इससे यात्रा की बाधा भी कम होगी और जाम का संकट भी। जब फ़िल्मों को मनोरंजन कर मुक्त किया जा सकता है तो महाकुंभ के महापर्व पर गाड़ियों को कर मुक्त क्यों नहीं? pic.twitter.com/1ceISd8WNK
— Akhilesh Yadav (@yadavakhilesh) February 9, 2025
ప్రస్తుతం 200-300 కి.మీ మేర ట్రాఫిక్ జామ్ ఉన్నందున ప్రయాగ్‌రాజ్ వైపు వెళ్లడం అసాధ్యమని మధ్యప్రదేశ్‌లోని మైహార్ పోలీసులు తెలిపారు. తాజా పరిస్థితిపై ప్రతిపక్ష పార్టీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. యూపీ సర్కార్ నిర్వహణ లోపం కారణంగానే ఈ సమస్యలు తలెత్తుతున్నాయని సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) ధ్వజమెత్తారు. ట్రాఫిక్‌లో చిక్కుకుపోయిన యాత్రికులకు తక్షణ అత్యవసర ఏర్పాట్లు చేయాలని యోగి సర్కార్‌కు విజ్ఞప్తి చేశారు. సాధారణ భక్తులు మనుషులు కాదా..? అంటూ ప్రశ్నించారు. ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకుని ఆకలి, దాహంతో అలమటిస్తున్న భక్తులను మానవీయ దృక్పథంతో చూసి వారికి అవసరమైన సాయం అందించాలని అన్నారు.
ప్రయాగ్‌రాజ్‌లో ట్రాఫిక్ పరిస్థితిపై అఖిలేష్ యాదవ్ ఎక్స్ వేదికగా వరుస ట్వీట్లు చేశారు. మహా కుంభ్ సందర్భంగా యూపీలో వాహనాలను టోల్ ఫ్రీగా మార్చాలని డిమాండ్ చేశారు. ఇలా చేయడం వల్ల ప్రయాణ సమస్యలతోపాటు, ట్రాఫిక్ సమస్యలు కూడా తగ్గుతాయని అభిప్రాయపడ్డారు. ‘సినిమాలను వినోద పన్ను రహితంగా చేయగలిగినప్పుడు.. వాహనాలను టోల్ ఫ్రీగా ఎందుకు చేయకూడదు..?’ అంటూ ప్రశ్నించారు. ‘లక్నో వైపు నుంచి ప్రయాగ్‌రాజ్‌లోకి ప్రవేశించేందుకు ఇప్పటికే 30 కిలోమీటర్ల మేర జామ్ ఏర్పడింది. రేవా రహదారికి 16 కిలోమీరట్ల ముందే గౌహానియాలో ట్రాఫిక్ నెలకొంది. వారణాసి వైపు 12 నుంచి 15 కిమీ జామ్ ఏర్పడింది. రైళ్లలో కూడా విపరీతమైన రద్దీ ఉంది’ అని అఖిలేష్ యాదవ్ పేర్కొన్నారు. ఈ మేరకు యూపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
Also Read..
Droupadi Murmu | త్రివేణీ సంగమంలో రాష్ట్రపతి ముర్ము పుణ్యస్నానం.. గంగమ్మకు ప్రత్యేక పూజలు
Vijay Devarakonda | కుంభమేళాలో విజయ్ దేవరకొండ.. త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం
Aero India 2025 | ఏరో ఇండియా-2025 ప్రారంభం.. ఆకట్టుకుంటున్న యుద్ధ విమానాల ప్రదర్శన.. VIDEOS