Vijay Devarakonda – Mahakumbh | ఉత్తరప్రదేశ్‌లోని ప్రయోగ్ రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండ హాజరయ్యాడు.
తన ఫ్యామిలీతో కలిసి ఆదివారం ప్రయాగ్‌రాజ్‌కి వెళ్లిన విజయ్ మహా కుంభమేళాలో పాల్గొన్నాడు. అనంతరం త్రివేణి సంగమంలో తన అమ్మతో కలిసి పవిత్ర స్నానం ఆచరించారు. కాగా ఇందుకు సంబంధించిన ఫొటోలను తన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు విజయ్. అంతకుముందు విజయ్ ప్రయాగ్‌రాజ్ వెళ్లడానికి శనివారం హైదరాబాద్ ఎయిర్పోర్ట్ వెళ్లగా.. విజయ్ ఎక్కిన సాంకేతిక సమస్యల కారణంగా 5 గంటల పాటు ఆలస్యం అయ్యింది. సినిమాల విషయానికి వస్తే.. విజయ్ ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరితో ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాడు. పీరియాడిక్ కథతో వస్తున్న ఈ సినిమాలో భాగ్యశ్రీ భోర్సే కథానాయికగా నటిస్తుండగా.. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు.
#VijayDeverakonda and his mother took a holy dip at the #MahaKumbhMela. pic.twitter.com/FC13ls2eft
— DOE CINEMA (@doecinema) February 9, 2025