Maoists : ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బస్తర్ జిల్లాలో 22 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో 14 మంది పురుషులు, 8 మంది మహిళలు ఉన్నారు. బస్తర్ డివిజన్లో భద్రతా దళాల నిరంతర ఒత్తిడి, రాష్ట్ర ప్రభుత్వ పునరావాస విధానంవల్ల ప్రభావితమై పెద్ద సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోతున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా నారాయణపూర్ జిల్లా అబూజ్మడ్ ప్రాంతంలో చురుగ్గా ఉన్న 22 మంది మావోయిస్టులు గురువారం ఎస్పీ రాబిన్సన్ గుడియా ముందు లొంగిపోయారు. వీరిలో కుతుల్ ఏరియా కమిటీ కమాండర్ సుఖ్లాల్ కూడా ఉన్నట్లు పోలీసులు శుక్రవారం వెల్లడించారు. లొంగిపోయిన 22 మంది మావోయిస్టులపై మొత్తం రూ.37 లక్షల రివార్డు ఉన్నట్లు తెలిపారు.