Crime news | బావపైకి త్రిశూలం విసిరిన మరదలు.. తలలో త్రిశూలం దిగి బాలుడు మృతి
Crime news | భార్యాభర్తల మధ్య జరిగిన గొడవ అభం శుభం తెలియని ఓ చిన్నారి నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. తమ్ముడు, మరదలు గొడవ పడుతుండటంతో అడ్డుకోవడానికి వచ్చిన బావపైకి మరదలు త్రిశూలం విసిరింది. ఆ త్రిశూలం తలలో గుచ్చుకుని బావ కొడుకు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు.
Crime news : భార్యాభర్తల మధ్య జరిగిన గొడవ అభం శుభం తెలియని ఓ చిన్నారి నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. తమ్ముడు, మరదలు గొడవ పడుతుండటంతో అడ్డుకోవడానికి వచ్చిన బావపైకి మరదలు త్రిశూలం విసిరింది. ఆ త్రిశూలం తలలో గుచ్చుకుని బావ కొడుకు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. మహారాష్ట్ర (Maharastra) లోని అహ్మద్‌నగర్ జిల్లా (Ahmednagar district) లో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. అహ్మద్‌నగర్ జిల్లాలోని కేడ్గావ్ గ్రామం అంబెగావ్ రిహాబిలిటేషన్ కాలనీకి చెందిన సచిన్ మెంగ్వాడే, పల్లవి మెంగ్వాడే ఇద్దరూ భార్యాభర్తలు. గురువారం భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఈ గొడవను ఆపేందుకు సచిన్ మెంగ్వాడే అన్న నితిన్ మెంగ్వాడే, అతడి భార్య భాగ్యశ్రీ ప్రయత్నించారు. ఈ క్రమంలో అప్పటికే ఆగ్రహంతో ఊగిపోతున్న పల్లవి మెంగ్వాడే తన బావ నితిన్ మెంగ్వాడే పైకి త్రిశూలం విసిరింది.
దాంతో ఆ త్రిశూలం నుంచి తప్పించుకునేందుకు నితిన్ మెంగ్వాడే పక్కకు జరిగాడు. అయితే నితిన్ వెనుకాలే తన తల్లి భాగ్యశ్రీ చంకలో ఉన్న 11 నెలల బాలుడు అవదూత్ మెంగ్వాడే తలలోకి ఆ త్రిశూలం దూసుకెళ్లింది. దాంతో అవదూత్ విలవిల్లాడుతూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పల్లవి మెంగ్వాడే, సచిన్ మెంగ్వాడేపై కేసులు బుక్ చేశారు. ఘటనపై ప్రశ్నించేందుకు నితిన్ మెంగ్వాడేను కూడా అదుపులోకి తీసుకున్నారు.
Read More >>
మాతో కలిసి పనిచేయకుండా ప్రతీకార సుంకాలు విధిస్తున్నారు.. కెనడాపై 35 శాతం టారీఫ్ విధించిన ట్రంప్
మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో రెండు రోజులు వైన్స్ బంద్కోడి
కాళ్లు విరగ్గొట్టారు.. వారికి శిక్ష పడాల్సిందే!.. పోలీస్టేషన్లో వృద్దురాలు పంచాయతి!!
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్‌లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
Akka Teaser | ‘అక్క’ టీజర్‌తో ఆసక్తి రేపుతున్న కీర్తి సురేశ్.. రాధికా ఆప్టేతో హోరాహోరీ పోరు!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

